February 23, 2020

నీతో వసంతాలు తెచ్చావని


కుహు కుహూ.. కోయిల
చిత్రం: డబ్బు డబ్బు డబ్బు (1981)
సంగీతం: శ్యామ్
గీతరచయిత: వీటూరి
నేపధ్య గానం: జానకి

పల్లవి:

కుహు కుహూ.. హూ. కోయిల
నాతో నీవు వచ్చావని
నీతో వసంతాలు తెచ్చావని
బాగుందట జంటా బాగుందట
పండాలట మన ప్రేమే పండాలట
కుహు కుహూ.. హూ..కుహు కుహూ.. హూ..
చరణం 1:

నీడగ నీ వెంట
నే జీవించాలంట..
ఓ.ఓ.ఓ..ఓ.. బావా...
నీడగ నీ వెంట
నే జీవించాలంట..
ఓ.ఓ.ఓ..ఓ.. బావా...
నీ హృదయంలోన మరుమల్లెల వాన..
నీ హృదయంలోన మరుమల్లెల వాన
కురిసి మురిసి పులకించాలంటా...
కురిసి మురిసి పులకించాలంటా

కుహు కుహూ.. హూ..
కుహు కుహూ.. హూ...

చరణం 2:

గుండెల గుడిలోన ..
నా దైవం నీవంటా..
ఓ.. ఓ. ఓ. బావా
గుండెల గుడిలోన ..
నా దైవం నీవంటా..
ఓ.. ఓ. ఓ. బావా
నీ కన్నుల వెలిగే ...
హారతి నేనంటా
నీ కన్నుల వెలిగే ...
హారతి నేనంటా
కలసి మెలసి తరియించాలంటా..
కలసి మెలసి తరియించాలంటా

కుహు కుహూ కూసే కోయిల...
నాతో నీవు వచ్చావని
నీతో వసంతాలు తెచ్చావని
బాగుందట జంటా బాగుందట...
పండాలట మన ప్రేమే పండాలటా..

కుహు కుహూ...