February 19, 2020

కళ్ళు తెరిస్తే ఉయ్యాల.. కళ్ళు మూస్తే మొయ్యాల


యాలో యాలో ఉయ్యాల
చిత్రం: ఎర్రమందారం (1991)
సంగీతం: చక్రవర్తి
రచన: జాలాది రాజారావు
గానం: రాజా, చిత్ర

పల్లవి:

యాలో యాలో ఉయ్యాల
ఏడేడు జనమాలు మొయ్యాల...
నాలుగు దిక్కుల ఉయ్యాల...
నలుగురు కలిసే మొయ్యాల...
కళ్ళు తెరుసుకుంటే ఉయ్యాల..
కళ్ళు మూసుకుంటే మొయ్యాల
కళ్ళు మూసుకుంటే మొయ్యాల
యాలో యాలో ఉయ్యాల
ఏడేడు జనమాలు మొయ్యాల...చరణం 1:

మాసాలు మొయ్యాల
మడిసిని సెయ్యాల
కన్నీళ్ళ ఉగ్గెట్టి
కష్టాల బువ్వెట్టి
కాపాడుకోవాల

చిరునవ్వు లాడాల
ఆడు...చిట్టడుగులెయ్యాలా
దండాలు మొక్కించి
గండాలు రాకుండా
గుండెల్లొ దాయాలా
అడుగడుగున అణగారుతు బతికుండాల
ఆ బతుకున ఒక మెతుకేసే తోడుండాల
కొడుకైనా...ఆ...
కొడుకైనా గొడుగయ్యే ఋణముండాలా
శరణైనా శవమల్లే బతికుండాలా
యాలో యాలో ఉయ్యాల
ఏడేడు జనమాలు మొయ్యాల...

చరణం 2:

పారాడె వయసేమో
పకపక నవ్వాలా
గోరాడె వయసేమో
తాతయ్యతో చేరి దోబూచులాడాలా
నడికారు వయసేమో
నడుములు గట్టాలా
పుట్టిన నేలను
పెట్టే తల్లిని
కాపాడుకోవాల
నడుమొంగే వయసైనా నిలిసుండాలా
నలుగురికొకటే నాయం కలిగుండాలా
చావైనా...
చావైనా బతుకైనా పోరాడాలా
కడకైనా కలగన్నది నిజమవ్వాలా

యాలో యాలో ఉయ్యాల
ఏడేడు జనమాలు మొయ్యాల
యాలో యాలో ఉయ్యాల
ఏడేడు జనమాలు మొయ్యాల