February 25, 2020

ఈ సంజెలో... కెంజాయలో


ఈ సంజెలో
చిత్రం : మూగప్రేమ (1976)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, బాలు (కోరస్)

పల్లవి :

ఈ సంజెలో... కెంజాయలో
ఈ సంజెలో... కెంజాయలో..
చిరుగాలులా... కెరటాలలో...

ఈ సంజెలో... కెంజాయలో..
చిరుగాలుల... కెరటాలలో...
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అహహహా... ఈ సంజెలో...
చరణం 1 :

ఆ... ఆ... హా... ఓ... ఓ... హో...
ఈ మేఘమే రాగస్వరమో
ఆ...
ఆ రాగమే మూగపదమో
ఆ...
ఈ మేఘమే రాగస్వరమో
ఆ...
ఆ రాగమే మూగపదమో
ఆ...
ఈ చెంగు ఏ వయసు పొంగో
ఆ....
ఆ పొంగు ఆర్పేది ఎవరో
ఎవరో... అదెవరో రెపరెపరెపరెపరెప
ఈ సంజెలో...

చరణం 2 :

ఊ... ఊ... హూ... ఆ... ఆ...హా...
పులకించి ఒక కన్నెమనసు
ఆ...
పలికింది తొలి తీపిపలుకు
ఊ...
పులకించి ఒక కన్నెమనసు
ఆ...
పలికింది తొలి తీపిపలుకు
ఊ...
ఓ ఓ...
చిలికింది అది లేతకవిత
ఆ...
పొదిగింది తనలోని మమత
మదిలో మమతలో
రిమజిమ రిమజిమ రిమజిమ
ఈ సంజెలో...

చరణం 3 :

ఆ... ఆ... హా... ఓ... ఓ... హో...
నా కళ్లలో ఇల్లరికము
ఆ...
నా గుండెలో రాచరికము
ఆ...
నా కళ్లలో ఇల్లరికము
ఆ...హా..ఆ.
నా గుండెలో రాచరికము ఆ...
నీదేను నీదేను నిజము ఆ...
నేనుంది నీలోన సగము
సగమే... జగముగా
కలకలకల కిలకిలకిల

ఈ సంజెలో... కెంజాయలో....
చిరుగాలుల... కెరటాలలో...
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అహహహా...ఈ సంజెలో...