February 18, 2020

పులకింతలు హద్దులు దాటెనులే


తం తన నంతన తాళంలో
చిత్రం: కొత్త జీవితాలు (1980)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: జానకి, సుశీల

పల్లవి:

తననం...తననం...తననం...తననం..త...
ఆ....ఆ....ఆ...ఆ...ఆ...ఆ...ఆ..ఆ..
తం...తననం..తననం...తననం...తననం...
తం తన నంతన తాళంలో..
రస రాగంలో
మృదునాదంలో ..
నవ జీవన భావన పలికెనులే
తం తన నంతన తాళంలో..
రస రాగంలో
మృదునాదంలో ..
నవ జీవన భావన పలికెనులేనవ భావనయే సుమ మోహనమై...
ఆపై వలపై
పిలుపై కళలొలుకగ
తం తన నంతన తాళంలో..
మృదునాదంలో..నవ జీవన భావన పలికెనులే

చరణం 1:

ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర
వీచెనులే...
మది దోచెనులే...
మరుమల్లెలు సైగలు చేసెనులే
ఆ....ఆ...ఆ...ఆ...

ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర
వీచెనులే...
మది దోచెనులే...
మరుమల్లెలు సైగలు చేసెనులే

కన్నియ ఊహలు వెన్నెలలై...
కదలే కదలే విరి ఊయలలై
పున్నమి వేసిన ముగ్గులలో...
కన్నులు దాటిన సిగ్గులలో
తేనెలకందని తీయని కోరికలే...
చిరుమరులను చిలుకగ

తం తన నంతన తాళంలో..
రసరాగంలో
మృదునాదంలో...
నవ జీవన భావన పలికెనులే

చరణం 2:

పొంచిన మదనుడు
పువ్వుల బాణం...
నాటెనులే..
ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
పొంచిన మదనుడు
పువ్వుల బాణం...
నాటెనులే..ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే

మ్రోగెను పరువం రాగిణియై...
మురిసే మురిసే చెలి మోహినియై
వన్నెల తుంటల పందిరిలో...
వెన్నెల రాయని కౌగిలిలో
ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే...
మృదుమధురిమలోలుకగ

తం తన నంతన తాళంలో...
రస రాగంలో మృదునాదంలో
నవ జీవన భావన పలికెనులే...
నవ భావనయే సుమమోహనమై...
ఆపై వలపై పిలుపై కళలొలుకగ...
తం తన నంతన తాళంలో...
రస రాగంలో మృదునాదంలో
నవ జీవన భావన పలికెనులే...
తం తననం తననం తననం తననం తననం