పక్కా జెంటిల్‌మాన్‌ని

చిత్రం: సూపర్ పోలీస్ (1994)
సంగీతం: రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, జానకి

పల్లవి : 

పక్కా జెంటిల్‌మాన్‌ని 
చుట్టపక్కాలే లేనోడ్ని   
పూలపక్కే వేసి చక్కా వస్తావా 

పక్కా జెంటిల్‌మాన్‌ని 
చుట్టపక్కాలే లేనోడ్ని   
పూలపక్కే వేసి చక్కా వస్తావా 

ఆ ఆ...
పుణ్యం కొద్దీ పురుషా 
పట్టెమంచం కొద్దీ మనిషా 
పాలచుక్కే చూసి పైపైకొస్తావా 

పుణ్యం కొద్దీ పురుషా 
పట్టెమంచం కొద్దీ మనిషా 
పాల చుక్కే చూసి పైపైకొస్తావా

కులాసాల ఘంటసాల
కొత్త కూనిరాగమందుకో
మారా ఓ కుమారా 
కుర్ర కూచిపూడి ఆడుకో 

పక్కా జెంటిల్‌మాన్‌ని 

తేలుకుట్టినా తెనాలిలో

సూపర్ పోలీస్ (1994)
గానం: మనో, సుజాత
రచన: వేటూరి
సంగీతం: రెహమాన్ 

పల్లవి : 

తేలుకుట్టినా తెనాలిలో 
తేనెటీగల పెదాలలో 

మంటపెట్టకూ మనాలిలో
మల్లెమొగ్గల మసాజులో 

కన్నుకొట్టకే కబాడిలో
కౌగిలింతల కవాతులో

లవ్వు అన్న ఈ లడాయిలో 
పువ్వు తాకకూ బడాయితో 

నీకు షేపున్నది నాకు చూపున్నది 
ఊపు ఉయ్యూరు దాటిందిలే ఊర్వశీ 

తేలుకుట్టినా తెనాలిలో 

వారెవ్వా చందమామ

రణం (2006)
రచన: సుద్దాల అశోక్ తేజ 
గానం: మహాలక్ష్మి అయ్యర్, మల్లికార్జున్ 
సంగీతం: మణిశర్మ 

పల్లవి:

వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది

వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది

కొమ్మల్లో నేడే కూకూలే మోగే
రెమ్మల్లొ దాగే పూలన్నీ మూగే
ఇలాంటి చోటే ఎపుడుంటే ఇక హాయే

వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది

వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది

మీసాల పిల్ల

మన శంకరవరప్రసాద్ గారు (2026)
గాయకులు: ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో 
సాహిత్యం: భాస్కరభట్ల 

పల్లవి:

హే మీసాల పిల్లా.. 
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..
మీసాల పిల్లా.. 
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..
పొద్దున్ లేచిందగ్గర నుంచీ డైలీ యుద్ధాలా?
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళా?

అట్లా కన్నెర్ర జెయ్యలా.. 
కారాలే నూరేలా
ఇట్టా దుమ్మెత్తిపొయ్యలా.. 
దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే.. 
చిరుతకి చెమటలు పట్టేలా

నీ వేషాలు చాల్లే.. 
నువ్ కాకాపడితే కరిగేటంత సీనేలేదులే
అందితె జుట్టూ.. అందకపోతే కాళ్ళబేరాలా
నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..

ఓ బాబు నువ్వే ఇంతేనా..
మగజాతి మొత్తం ఇంతేనా..
గుండెల్లో ముళ్ళు గుచ్చి 
పువ్వులు చేతికి ఇస్తారా..?

మీసాల పిల్లా.. 

హే చిన్నా

రణం (2006)
గీత రచన: బాషాశ్రీ 
గానం: టిప్పు, అనురాధా శ్రీరామ్ 
సంగీత: మణిశర్మ 

పల్లవి :  

హే చిన్నా రా చిన్నా 
హే చిన్నా రా చిన్నా

అంబ పలుకుతుందే
నాతొ పెట్టుకుంటె చిలకా
దిమ్మతిరిగిపోద్దే
దెబ్బ కొట్టానంటే గనకా

కళ్ళు తిరిగిపోవా చిన్నా 
పెట్టాడంటే మడతా
పంబ రగిలి పోదా
చుమ్మా ఇచ్చాడంటే చిరుతా

చిన్నమ్మీ వత్తావా
సంగతే సూత్తావా
నీ వంట్లో నరం నరం వేగిపోతాదే

అందుకే మెచ్చారా
నీ వెంటే వచ్చారా
నువ్వంటే పడి పడి చచ్చిపోతారా

హే చిన్నా రా చిన్నా 
హే చిన్నా రా చిన్నా

నను ప్రేమించానను మాట..

జోడీ (1999)
సంగీతం: రెహమాన్ 
గానం: సుజాత, శ్రీనివాస్
రచన: భువనచంద్ర 

పల్లవి : 

నను ప్రేమించానను మాట.. 
కలనైనా చెప్పెయ్ నేస్తం.. 
కలకా..లం బ్రతికేస్తా..
 
నను ప్రేమించానను మాట 
కలనైనా చెప్పెయ్ నేస్తం 
కలకాలం బ్రతికేస్తా… 

పూవుల ఎదలో శబ్దం.. 
మన మనసులు చేసే యుద్ధం 
ఇక ఓపదె నా హృదయం…
ఓపదే.. నా హృదయం…

సత్యమసత్యాలు పక్కపక్కనే .. 
ఉంటయ్ పక్కపక్కనే… 
చూపుకి రెండూ ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే.. 
చూసే కళ్లు ఒక్కటే… 
అయినా రెండూ వేరేలే..

నను ప్రేమించానను

అందాల జీవా

జోడీ (1999)
సంగీతం: రెహమాన్ 
గానం: మనో, స్వర్ణలత
రచన: భువనచంద్ర 

పల్లవి : 

జీవా జీవా జీవా జీవా
ఓ ఓఓ 
(అందాల జీవా… అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)
(చల్, అందాల జీవా… అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)

నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి… పాడే మగువా రా
పంచుకుందాం ప్రేమ… రాలేవా రాలేవా రావా
నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే మగువా రా
పంచుకుందాం ప్రేమ రాలేవా రాలేవా రావా

పువ్వులనే అస్త్రముగా… మార్చిన ఓ జీవా
పువ్వులతో నా ఎదనే… గుచ్చిన ఓ జీవా
నా గుండెలోన పొంగుతున్న ప్రేమా రా
ముద్దు రుచులను… మరిగిన సఖుడా రా
ఆశలు తీర్చే దేవా… దేవా రా

తొలిప్రేమై విరిసిన… చెలియా రా
నా మదిలో మెరిసిన… మెరుపా రా
తొలి పున్నమి పూసిన పువ్వై రావా
రావా రావా

స్వాతిచినుకా

అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ
రచన: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

పల్లవి : 

స్వాతిచినుకా 
సందె తళుకా 
నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా 
రావే కౌగిలింటి దాకా
చందమామ తునకా 
రావే కౌగిలింటి దాకా

ఇంత చురకా 
వింత ఉరుకా 
ప్రేమే పుట్టాకా
అబ్బో ఆగడాల దుడుకా
అల్లే అల్లరింటి కొడుకా
ఆగడాల దుడుకా 
అల్లే అల్లరింటి కొడుకా

చేరుకో నన్నే తారకా....

కోలుకోలేనే కోరికా.....

నేరుగా వచ్చేసాక 
మోమాటమేముంది
ముద్దాడవే గోపిక

స్వాతిచినుకా 

ప్రేమ ఓ ప్రేమా

మనసులో మాట (1999)
రచన: సిరివెన్నెల
సంగీతం: ఎస్వీ కృష్ణారెడ్డి 
గానం: చిత్ర

పల్లవి : 

ప్రేమ ఓ ప్రేమా వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా హయ్యో రామా

గుమ్మందాకా వచ్చి
ఇపుడాలోచిస్తావేమ్మా

గుండెల్లో కొలువుంచి
నిన్ను ఆరాతీస్తాలేమ్మా
ఇకపై నువ్వే నా చిరునామా

ప్రేమా ఓ ప్రేమ వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా హయ్యో రామా

పదహారేళ్ళ పాపా

ఒట్టేసి చెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
గానం: సుజాత మోహన్, దేబాశిష్
రచన: సిరివెన్నెల 

పల్లవి : 

పదహారేళ్ళ పాపా నీకు ఏదిష్టం
ఏదిష్టం ఏదేదిష్టం
హే పదహారేళ్ళ పాపా నీకు ఏదిష్టం
ఏదిష్టం ఏదేదిష్టం
నా పేరిష్టం
తరవాత
మా ఊరిష్టం
తరవాత
మా అమ్మిష్టం
తరవాత
మా నాన్నిష్టం
తరవాత
అన్నిటికన్నా అందరికన్నా
అన్నిటికన్నా అందరికన్నా
నువ్వంటే చాలా చాలా ఇష్టం
పదహారేళ్ళ పాపా నీకు ఏదిష్టం
ఏదిష్టం ఏదేదిష్టం