పాటలలోనా జీవితమే పలికించేనంటా


పాటలలోనా జీవితమే
నవవసంతం (1990)
ఎస్.ఏ. రాజ్ కుమార్
బాలు

పాటలలోనా జీవితమే పలికించేనంటా
మాటలలో చందనమే వెదజల్లేనంట

ఉదయం పలికించాలి నాదం నాదం
గాలీ ఇక వేయాలి తాళం తాళం

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా


చుక్కా చుక్కా కన్నీటి
సర్పయాగం (1991)
విద్యా సాగర్
సినారె 
బాలు.

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు
అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
నేనే నీ అమ్మనుకుంటే ప్రాణం హారతి పడతాను
బ్రతుకే పండిందంటాను.

తాయే యశోదా


తాయే యశోదా..ఉందన్నాయకులతుదిత్త …వాయన్ గోపాలకృష్ణన్ చెయ్యుమ్
తోడి రాగం లో స్వరపరచిన ఈ గీతం  శాస్త్రీయ సంగీతం ఆధారంగా వచ్చిన పాటల లో ఇది ఒక ‘ఆణిముత్యం’

చిత్రం : రాగం  (2006)
రచన : ఊతుకా వెంకటసుబ్బయ్యర్
సంగీతం : మణిశర్మ
గానం : రంజనీ రామకృష్ణన్, సుధా రఘునాథన్

సాసాస రిరిసస్ససాస రిరి సాసాస
నిసరిస నిసరిస నిసరిస
నిరిస దాదా
దదరీరీరి రీరిరీరి నిరినిరి గారీ
నిగరి నిరిని దనిద
మగమ గరిని ఆ….
తాయే యశోదా
ఉందన్నాయకులతుదిత్త (2)

సిరులొలికించే చిన్నినవ్వులే


సిరులొలికించే చిన్నినవ్వులే
యమలీల (1994)
గాత్రం: చిత్ర,బాలు
సంగీతం: కృష్ణారెడ్డి
రచన: సిరివెన్నెల

పల్లవి:

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా

పలికే గోరింకా చూడవే నా వంక



పలికే గోరింకా....
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
రచన: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: సాధనా సర్గమ్

పలికే గోరింకా చూడవే నా వంక 
ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంక 
ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగ
నేడే రావాలి నా దీపావళి పండగ
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా నేడే పూయులే

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే


ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
చిత్రం : ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం : కళ్యాణి కోడూరి
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : కళ్యాణి కోడూరి, సునీత

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే
ఆనందాలు పెంచింది

మనోహర నా హృదయమునే


మనోహర నా హృదయమునే
చిత్రం: చెలి (2001)
సంగీతం: హారీస్ జైరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాంబే జయశ్రీ

మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట

గుండెల్లో ఏదో సడీ


గుండెల్లో ఏదో సడీ
చిత్రం: గోలీమార్ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి, కౌసల్య

పల్లవి:

గుండెల్లో ...హ్మ్మ్
కళ్ళల్లో ...హ్మ్మ్

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి

నా ప్రాణం కోరింది నన్నే .. నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో .. నువ్వుంటే వస్తానని

తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడీ
తుళ్ళీ తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడీ

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి

నాలో చిలిపి కల


నాలో చిలిపి కల
చిత్రం : లవర్ (2018)
సంగీతం : సాయి కార్తీక్
సాహిత్యం : శ్రీమణి
గానం : యాజిన్ నిజార్

నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా
నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా

గుండెలో ఈ ఊహలేమిటో
చూపలేని దాచలేని అల్లరిలా
తియ్యని ఈ వేదనేమిటో
మాటలే మోయలేని మౌనంలా

సింధూరపువ్వా తేనె చిందించరావా


సింధూరపువ్వా
సింధూరపువ్వు(1988)
బాలు, చిత్ర
మనోజ్-గియాన్

సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి
సిరులే అందించరావా
కలలే విరిసేనే కధలే పాడెనే
ఒక నదివోలే ఆనందం ఎద పొంగెనే ఏ ఏ ఏ ఏ

ఓ సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి
సిరులే అందించరావా