March 22, 2020

సన్నని నడుముకీ


సన్నని నడుముకీ
బంగారు బాబు (2009)
శ్రీలేఖ
చంద్రబోస్
బాలు, శ్రీలేఖ 

సన్నని నడుముకీ సన్నజాజులు
నల్లని కనులకీ తెల్లకలువలు
పగడపు పెదవికీ పొగడపూలు
ముసిముసినవ్వుకీ ముద్దబంతులూ
ముక్కుకి సంపెంగముంగురులకి పున్నాగ
చెంపకి చేమంతీ
అరచేతికి చెంబేలి
అన్ని పూలతో కన్నెపువ్వుకీ
అన్ని పూలతో కన్నెపువ్వుకీ పుష్పాభిషేకం.

సన్నని నడుముకీ సన్నజాజులు
నల్లని కనులకీ తెల్లకలువలు

చరణం 1:

కసిరిన కంటికి
ఆ... కనకాంబ్రాలు
మరి.. దీన్నేమంటారు?
దేన్నీ
నిలిచిన కాలికీ
నీలాంబ్రాలు
అలిగిన మోముకీ
అడవి మల్లెలు
అలసిన మేనుకీ
దిరిసెన పూలు
కల్లోకొస్తే
కాశ్మీరాలు
ముందే ఉంటే
మందారాలు
పొద్దుటె
పద్మాలు
మధ్యాహ్నం
మారేడు
సిగలో గుప్పెడు పూలు
చెవిలో పెట్టను పూలు

అన్ని పూలతో కన్నెపువ్వుకీ
అన్ని పూలతో కన్నెపువ్వుకి
కనకాభిషేకం. 

సన్నని నడుముకీ
సన్నజాజులు
నల్లని కనులకీ
తెల్లకలువలు

చరణం 2:

పుట్టినరోజుకీ
పారిజాతాలు
ఓ అలావచ్చావా దొంగా...
ప్రేమల రోజుకీ
వెరీ సింపుల్
రోజా పూలు
తాంబూలాలకీ
గంధం పూలు
సుముహుర్తాలకీ
శివలింగం పూలు
పడికట్టుకీ
మొగలి పూలూ
పడుచొంటికీ
మొగుడేచాలు
తొలిరేయి
ముడిపూలు
మలిరేయి
విడిపూలు
నాలో నీలో కలిపి నలిగే మల్లెపూలు

అన్ని పూలతో కన్నెపువ్వుకీ
అన్ని పూలతో కన్నెపువ్వుకీ
అమృతాభిషేకం. 

సన్నని నడుముకీ
సన్నజాజులు
నల్లని కనులకీ
తెల్లకలువలు