March 11, 2020

అస్కావా


అందని అందం అస్కావా
నీ మనసు నాకు తెలుసు (2003)
రెహమాన్
రత్నం, శివ గణేష్
శ్రేయా గోషాల్, సూర్జో భట్టాచార్య

పల్లవి :

తకదిమి తకదిమి త...
తకదిమి తకదిమి త...
ఏ ఓయ్ మా...
తకదిమి తకదిమి త...
తకదిమి తకదిమి త...
ఏ ఓయ్ మా...ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే అస్కావా
ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే వస్తావా
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా
ఆహా....
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా
ఈ అందం...
అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా
ఒరేయ్....
కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా
ధిం తరత్తే తరారిరత్తే తరారిరత్తే అస్కావా
ధిం తరత్తే తరారిరత్తే తరారిరత్తే వస్తావా
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా

చరణం : 1

నేస్తం నెచ్చెలి మాటలతో
మిమ్ములనెపుడు పిలిచెదము
పిరికి మాటలు చెప్పొద్దు
ప్రేయసి అంటూ పిలవండి
గురజాడ కలలు నిజమాయే
మీరే ఆ ప్రతిరూపాలు
తెనుగున మాటలు కరువైతే
ఫ్రెంచ్ భాషలో పొగడండి
అప్సరసలారా... ఆ...
మా జీవిత గమ్యం మీరేలే
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా
అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా
కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా

చరణం : 2

పట్టే మాకు దుస్తులుగా
వెంటనే మీరు మారండి
ఇంకా ఏమేం కావాలో
ప్రేమగ ఆజ్ఞలు వేయండి
భక్తి పరవశం చూసి
మనసు పొంగి పోయెనులే
పక్కన కాస్తా కూర్చుంటాం
అనుమతి మీరు ఇస్తారా
ప్రేమ పక్షులారా... ఆ...
మీదనే వచ్చి వాలండి
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా
అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా
ఒరేయ్....
కులమేలా మతమేలా నే వస్తేనే అస్కాలే
సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వస్తాలే
కులమేలా మతమేలా నే వస్తేనే అస్కాలే
సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వస్తాలే
ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే అస్కావా
ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే వస్తావా