Showing posts with label విక్రమార్క విజయం (1971). Show all posts
Showing posts with label విక్రమార్క విజయం (1971). Show all posts

ఎందుకు బిడియమూ ఎవరున్నారనీ

ఎందుకు బిడియము
విక్రమార్క విజయం (1971)
సంగీతం: ఆకుల అప్పారావ్
గానం: పి.బి.శ్రీనివాస్, సుశీల

ఎందుకు బిడియమూ ఎవరున్నారనీ
అధరాన సుధలూరు కదిలే ఝుమ్మన
ఎందుకు బిడియము ఎవరున్నారని
సొగసరి కలువగా విరిసిన చెలువను
గగనాన నెలరేడు గమనించే....ననీ
అందుకె బిడియము..
అందుకా బిడియమూ

నీలాల ముంగురుల మబ్బుల మాటుగా
నీమోము చందమామ నిగనిగలాడగ
నీలాల ముంగురుల మబ్బుల మాటుగా
నీమోము చందమామ నిగనిగలాడగ
ఆ పున్నమి జాబిలీ
దాగెనులే సిగ్గులే
ఆ పున్నమి జాబిలీ
దాగెనులే సిగ్గులే
అందించుము ఓ చెలీ
అందాల కౌగిలి
ఎందుకు బిడియమూ ఎవరున్నారనీ
అధరాన సుధలూరు కదిలే ఝుమ్మన
ఎందుకు బిడియము ఎవరున్నారని

ఏ పూలబాణాలో ఎదలో నాటగా
ఈ పైడి కిన్నెరల అల్లన మీటగా
ఏ పూలబాణాలో ఎదలో నాటగా
ఈ పైడి కిన్నెరల అల్లన మీటగా
తెలియని ఒక వింతగా
తీయని గిలిగింతగా
తెలియని ఒక వింతగా
తీయని గిలిగింతగా
ఒడలెల్ల పొంగెనురా ఓ రాజసుందరా

అందుకె బిడియము..
అందుకా బిడియమూ