దూరాకాశ వీధుల్లో
చిత్రం: మాయావి (1976)
సంగీతం:: చెళ్ళపిళ్ళ సత్యం
రచన:: డి. కృష్ణమూర్తి
గానం:: S. జానకి
పల్లవి::
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
భారమైన గుండెల్లో ఆరని దీపాలు
ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
చరణం::1
తోడు దొరకని బ్రతుకులలో..తోచే శోధనలు
మాయలెరుగని మనసులలో..మండే వేదనలు
కనిపెట్టి కరుణించేవి..కరుణించి కాపాడేవి
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
చరణం::2
మూసే చీకటి ముసుగుల్లో..దాగినవెన్నెన్నో
చేసే మాయల వేషం వెనుక దాగినవేమేమో
పయనించి పరికించేవి..పరికించి పాలించేవి
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
భారమైన గుండెల్లో ఆరని దీపాలు
ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు