Showing posts with label మనుషులు చేసిన దొంగలు (1977). Show all posts
Showing posts with label మనుషులు చేసిన దొంగలు (1977). Show all posts

నీవే.. నీవే.. ఓ ప్రియా

"వాదా కర్లే సాజనా" అన్న హిందీ పాటని తెలుగులో తర్జుమాచేసి ఆరుద్రగారు వలికించిన ప్రేమరసం...

నీవే.. నీవే.. ఓ ప్రియా
చిత్రం :  మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత  :  ఆరుద్ర
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల

పల్లవి :

నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా...

చరణం 1 :

అలలై ఊగే ఈ పూలలో... కలలై మూగే ఈ వేళలో
నను పిలిచే కోరిక నీవే...  నను పిలిచే కోరిక నీవే

పగలు  రేయి నా ధ్యానమై... ఏనాడైనా నాదానవై
నను తలచే రాధిక నీవే... నను తలచే రాధిక నీవే
ఆ.. ఆ... ఆ...ఆ...

నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా...

చరణం 2 :

పావన జీవన తీరాలలో...ఊహల కోయిల రాగలలో
నను కొలిచే దేవివి నీవే... నను కొలిచే దేవివి నీవే

అనురానికి వేదానివై... నా హృదయానికి నాదానివై
నను వలచే దైవము నీవే... నను వలచే దైవము నీవే
ఆ... ఆ.. ఆ ... ఆ...

నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా...