Showing posts with label మనసంతా నువ్వే (2001). Show all posts
Showing posts with label మనసంతా నువ్వే (2001). Show all posts

కిట కిట తలుపులు

కిట కిట తలుపులు
మనసంతా నువ్వే (2001)
సిరివెన్నెల
చిత్ర
ఆర్ఫీ పట్నాయక్

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
రెండూ కలిసీ ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ

నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదరే రాక
కమ్మని కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా
రెప్పపాటైనా లేకా చూడాలనుందే
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా
కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమ ప్రేమ

కంటతడి నాడూ నేడూ చెంప తడి నిండే చూడు
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి
అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా
ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమ ప్రేమ