Showing posts with label మధుర గీతం (1982). Show all posts
Showing posts with label మధుర గీతం (1982). Show all posts

నవ్వుల లోనా ...

నవ్వుల లోనా ...
చిత్రం : మధుర గీతం (1982)
రచన: రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
గానం : బాలు , జానకి

నవ్వుల లోనా ... పువ్వుల వానా ..
నవ్వుల లోన పూవ్వుల వాన
నీలో చిలికింది వయసు నాలో ఉరికింది మనసు
భావం నవరాగాలే కదలాడే శుభయోగాలే ..

నవ్వుల లోనా ... పువ్వుల వానా ..

కన్ను కన్ను కలిసిన వేళా నీకు నాకు బంధం వేసి ఆలాపించెనే
తీయని ఊసులు చిందులు వేసి ఊగే తూగే తలపే రేగే కధలే పాడేనే
కమ్మని వలపే కానుకలైతే కులికే కోరికలే తీరే వేడుకలే
జీవితమే వరించే రాగం లో ...

నవ్వుల లోనా ... పువ్వుల వానా ..

పరువం పాడే పల్లవి నేనై పగలు రేయీ తోడు నీడై నీతో సాగనా
ఆశలు పొంగే అనురాగాలు అంది అందని అనుబంధాలు నీలో చూడనా
మమతలు కురిసే నీవొడిలోన సోలితేలనా తేలిఆడనా
ఈనాడే ఫలించే స్నేహం ..

నవ్వుల లోనా ... పువ్వుల వానా ..
నీలో చిలికింది వయసు నాలో తురికింది మనసు
భావం నవ రాగాలే కదలాడే శుభయోగాలే ..