ఇది తొలి రాత్రి
మజ్ను (1987)
దాసరి
లక్ష్మీకాంత్-ప్యారేలాల్
బాలు
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్నకథల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
వెన్నెలమ్మ దీపాన్ని అర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
వెన్నెలమ్మ దీపాన్ని అర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
ధూపమేమో మత్తుగా తిరుగుచున్నది
దీపమేమో విరగబడి నవ్వుతున్నది
నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ....ఈ
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
వెన్నెలంత అడవిపాలు కానున్నది
మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
వెన్నెలంత అడవిపాలు కానున్నది
మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
ఆనురాగం గాలిలో దీపమైనది
మమకారం మనసునే కాల్చుతున్నది
నీ చివరి పిలుపు కొరకు
ఈ చావు రాని బ్రతుకు
చూసి చూసి వేచి వేచి వేగిపొతున్నది
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్నకథల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే