ముంజేతికి నీలి
పుణ్యస్త్రీ (1986)
చక్రవర్తి
వేటూరి
జానకి
ముంజేతికి నీలి సిరి గాజులే
మురిపాలకి సిగ విరజాజులే
వరమంటా బ్రతుకంతా
సిరులంటే పసుపంటా
పారాణి పాదాలే
రాణీ భోగాలే
ముంజేతికి నీలి సిరి గాజులే
మురిపాలకి సిగ విరజాజులే
చరణం 1:
కాటుక దిద్దనినాడు మాపే లేదంట
ముగ్గులు పెట్టనినాడు రేపే లేదంట
పదహారేళ్లు పరికిణీల
పుట్టిళ్లంటా
పల్లకి నాడు గుప్పిట దాగే
చెక్కిళ్ళంటా
పున్నమి పువ్వై
పూచిన ఈడు
తీగల్లే అల్లుకునే
మల్లెల నీడంటా
చరణం 2:
కుంకుమ దిద్దనినాడు కూయదు మందారం
అరుగులు అలకని నాడు కలగదు ఐశ్వర్యం
పుట్టిన కన్నె పుణ్యస్త్రీగా ఎదగాలంటా
మెట్టిన ఇంటా మాతృస్త్రీగా మెలగాలంటా
నోచిన నోమే పండిననాడు
పార్వతికి శ్రీసతికి తానే ముద్దంటా
ముంజేతికి నీలి సిరి గాజులే
మురిపాలకి సిగ విరజాజులే
వరమంటా బ్రతుకంతా
సిరులంటే పసుపంటా
పారాణి పాదాలే
రాణీ భోగాలే
ముంజేతికి నీలి సిరి గాజులే
మురిపాలకి సిగ విరజాజులే