Showing posts with label నీకు నేను నాకు నువ్వు (2003). Show all posts
Showing posts with label నీకు నేను నాకు నువ్వు (2003). Show all posts

తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం

తెలుగు భాష
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
రచన: చంద్రబోస్
సంగీతం: R. P. పట్నాయక్
గానం: S. P. బాలసుబ్రహ్మణ్యం, చరణ్

పల్లవి:

తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచి పొతే వాళ్ళని నువ్వు మరచినట్టురా
ఇది మరువబోకురా

తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచి పొతే వాళ్ళని నువ్వు మరచినట్టురా
ఇది మరువబోకురా

చరణం-1:

అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది
మమ్మీ డాడీ లోన ఆ మాధుర్యం ఎక్కడుంది....

మామా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది
అత్తా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్ లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది?

పరభాషా జ్ఞానాన్ని సంపాదించు ॥ 2 ॥
కాని నీ భాష లోనె నువ్వు  సంభాషించు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ ఋణం తీర్చరా కొంత ఋణం తీర్చరా

మా తెలుగు తల్లి కి మల్లెపూదండ... మా కన్న తల్లికి మంగళారతులు

చరణం-2:

కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతలు మార్చుకోవు
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము

ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేతున్నాము

అభివృద్ధి కి ఉండాలి నింగే హద్దు ॥ 2 ॥
అది భాషా ఆచారాలను మింగేయొద్దు...

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గు పడకురా వెనక్కి తగ్గమాకురా....

తెలుగు భాష తీయదనం తెలుగు భాష గొప్పదనం
తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం

మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా...
అమ్మ, నాన్నా అంటూ నేతి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా