Showing posts with label నిన్నే పెళ్ళాడుతా (1996). Show all posts
Showing posts with label నిన్నే పెళ్ళాడుతా (1996). Show all posts

ఎటో వెళ్లిపోయింది మనసు


ఎటో వెళ్లిపోయింది మనసు
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: రాజేష్ కృష్ణన్

పల్లవి:

ఎటో వెళ్లిపోయింది మనసు...
ఎటో వెళ్లిపోయింది మనసు...
ఇలా ఒంటరైయింది వయసు..
ఓ చల్ల గాలి 
ఆచూకి తీసీ 
కబురీయలేవా ఏమయిందో
ఎటో వెళ్లిపోయింది మనసు 
ఎటెళ్ళిందొ అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి 
ఆచూకి తీసీ 
కబురీయలేవా ఏమయిందో 
ఏమయిందో ఏమయిందో.

చరణం 1:

ఏ స్నేహమూ కావాలని 
ఇన్నాళ్ళుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని 
నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే 
రెక్కలొచ్చాయో ఏమిటో..

చరణం 2:

కలలన్నవి కొలువుండని 
కనులుండి ఏం లాభమందీ
ఏ కదలికా కనిపించని 
శిలలాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం 
ఎంతో వేడుకవుతుంది అంటూ..

కన్నుల్లో నీ రూపమే


కన్నుల్లో నీ రూపమే
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: హరిహరన్, చిత్ర 

పల్లవి:

కన్నుల్లో నీ రూపమే 
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే 
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు 
నా భాష ఈ మౌనమే

కన్నుల్లో నీ రూపమే 
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే 
నా శ్వాస నీ కోసమే

చరణం 1:

మది దాచుకున్నా రహస్యాన్ని 
వెతికేటి నీ చూపునాపేదేలా
నీ నీలి కన్నుల్లో పడి 
మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న 
నీ చిలిపి తలపులతో 
ఏమో ఎలా వేగడం....

చరణం 2:

అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను 
మదిలోని మాటేదని
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను 
నీ తెగువ చూడాలనీ
చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో 
ఏమో ఎలా ఆపటం