Showing posts with label చివరకు మిగిలేది (1960). Show all posts
Showing posts with label చివరకు మిగిలేది (1960). Show all posts

అందానికి అందం నేనే

అందానికి అందం నేనే
చిత్రం : చివరకు మిగిలేది (1960)
సంగీతం : అశ్వద్ధామ
సాహిత్యం : మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం : జమునారాణి

అందానికి అందం నేనే
జీవన మకరందం నేనే
అందానికి అందం నేనే
జీవన మకరందం నేనే
తీవెకు పూవును నేనే
పూవుకు తావిని నేనే
తీవెకు పూవును నేనే
పూవుకు తావిని నేనే
ధరణి అమరధామమయే
ఆనందము నేనే

అందానికి అందం నేనే
జీవన మకరందము నేనే

వాలు కనుల చూపులే
చెంగల్వ తోరణాలు
వాలారు చిరునవ్వులే..లే..
వన్నె విరుల హారాలు
నా మేనే..ఏ..మెరుపు తీవ
నగు మోమే..ఏ..చందమామ
నా మేనే మెరుపు తీవ
నగు మోమే చందమామ
నవరసాల సమ్మోహ
సమ్మేళన నేనే

అందానికి అందం నేనే
జీవన మకరందము నేనే

మలయానిల..లాలనలో
పదే పదే..పరవశమై
మలయానిల..లాలనలో
పదే పదే..పరవశమై
గానమేలు ఎలకోయిల
గళ మధురిమ నేనే
గానమేలు ఎలకోయిల
గళ మధురిమ నేనే
మాయని తియ్యందనాలు
మన వరాలే
అవలీలగా..జగమేలగా
అవలీలగా..జగమేలగా
నవచైతన్య సమ్మోహ
సమ్మేళన నేనే

అందానికి అందం నేనే
జీవన మకరందం నేనే
అందానికి అందం నేనే
జీవన మకరందం నేనే