March 11, 2020

ఏదో ఏదో నాలో

ఏదో ఏదో నాలో
నీ మనసు నాకు తెలుసు (2003)
రెహమాన్
రత్నం, శివ గణేష్
కార్తీక్, గోపికా పూర్ణిమ

ఏదో ఏదో నాలో పులకింత కలిగే
భాగ్యరేఖ వరియించెలే
ప్రేమరేఖ నాలో హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమికొట్టెనులే
ప్రియతమా...హృదయం
నీకే....నీకే
చరణం 1:

నిన్ను కోరిన కన్నె ముందర మౌనమన్నదే కష్టములే
మాటలాడని క్షణములన్నియు నష్టములే
మాట తెలుపని అసలు అర్ధము మౌనము లోనే
ఉన్నది ఉన్నది
మౌనము తెలిపి మాటలాడుటే మంచిది
సూర్యుని లాగ నా ముందు వెలిశావ్
మంచు బిందువల్లె కరిగితివే
ప్రియతమా...హృదయం
నీకే....నీకే
కలయే ఐతే ఉండి పోదాం
నిజమే ఐతే సాగిపోదాం
ఏదో ఏదో నాలో పులకింత కలిగే
భాగ్యరేఖ వరియించెలే
ప్రేమరేఖ నాలో హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమికొట్టెనులే

చరణం 2:

గుండె పీల్చిన శ్వాస ఎప్పుడు
నిశ్వాసమగుటయె న్యాయం న్యాయం
శ్వాస వాసనగ మారిపోవుటే మర్మం
కనులు కాంచిన కలలు ఎప్పుడు
తెలుపునలుపుగా తెలియును తెలియును
రంగు లాగ అవి మారిపొవుటే మర్మం
బోధివృక్షమల్లే నీ కనులు చూడా
నీ చూపు నాలో జ్ఞానమాయెనే
ప్రియతమా...హృదయం
నీకే....నీకే
ఏదో ఏదో నాలో పులకింత కలిగే
భాగ్యరేఖ వరియించెలే
ప్రేమరేఖ నాలో హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమికొట్టెనులే