Showing posts with label కొండపల్లి రాజా (1993). Show all posts
Showing posts with label కొండపల్లి రాజా (1993). Show all posts

కొండపల్లి రాజా గుండె చూడరా



కొండపల్లి రాజా గుండె చూడరా
చిత్రం : కొండపల్లి రాజా (1993)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి / భువనచంద్ర (??)
గానం : బాలు

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా

పశువంటె మనిషికి అలుసు
మనసున్న నీకది తెలుసు
అ ఆ ఇ ఈ రానేరాదు
అయినా మాయా మర్మం లేదు

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా

కన్నతల్లిలా పాలనిచ్చి ప్రాణం పోసే
త్యాగం ఉన్న గొప్ప జాతి నీది
సొమ్ము చూపిస్తే గొంతు కోసి రంకెలేసే
జాలిలేని పాడు లోకం మాది
తెలుసా బసవన్న నీకైనా
యెందుకు ఇంతటి భేదం
క్షణమే బతుకన్న ఓ బసవన్న
మనిషికి లేదురా పాశం
కాటికెళ్ళినా కాసు వీడడు
సాటివాడిపై జాలి చూపడు
డబ్బును మేసే మనుషులు కన్న
గడ్డిని మేసే నువ్వే మిన్న

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా

మబ్బు డొంకల్లో దూసుకెళ్ళే పక్షిని చూసి
కూర్చినాడు మనిషి విమానం
వాగు వంకల్లో ఈదుకెళ్ళే చేపని చూసి
నేర్చినాడు పడవ ప్రయాణం
దివికీ....భువికీ ముచ్చటగా
నిచ్చెన వేసిన మనిషి
చెలిమీ కలిమీ నలుగురికి
ఎందుకు పంచడు తెలిసీ
తరిగి పోనిదీ ప్రేమ ఒక్కటే
తిరిగి రానిదీ ప్రాణమొక్కటే
ప్రాణం కన్నా స్నేహం మిన్న
స్నేహం లేని బతుకే సున్నా

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా

పశువంటె మనిషికి అలుసు
మనసున్న నీకది తెలుసు
అ ఆ ఇ ఈ రానే రాదు
అయినా మాయా మర్మం లేదు

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా