Showing posts with label ఒకరికి ఒకరు (2003). Show all posts
Showing posts with label ఒకరికి ఒకరు (2003). Show all posts

నువ్వే... నా శ్వాస


నువ్వే నా శ్వాస
ఒకరికి ఒకరు (2003)
చంద్రబోస్
కీరవాణి
శ్రేయాగోషాల్

నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష
బ్రతుకైనా నీతోనే
చితికైనా నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష

పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు
తారలలో మెరుపులన్ని దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా...
నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా
నే మరవలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష

సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయలయలని
ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ఓ ప్రియతమా...ఓ ప్రియతమా...

వెళ్ళిపోతే ఎలా


వెళ్ళిపోతే ఎలా
ఒకరికి ఒకరు (2003)
చంద్రబోస్
కీరవాణి
శ్రేయాగోషాల్, కీరవాణి

వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా
అయినా ఎందుకిలా తడబాటు అంతలా
తెగ హుషారుగా ఎగిరిపోకే తగని ఊహ వెంట
సరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట

ఆమె వలలో చిక్కుకుందా సమయం
ప్రేమ లయలో దూకుతుందా హృదయం
నేను ఇపుడు ఎక్కడ ఉన్నానంటే
నాక్కూడ అంతు చిక్కకుంటే
గమ్మత్తుగానే ఉన్నదంటే
నాకేదో మత్తు కమ్మినట్టే

రమ్మంది గాని నన్ను చేరి మెరుపు సైగ చేసి
చెప్పింది నింగి చెలిదారి చినుకు వంతెనేసి
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా

తాను కూడ రాకపోతే నాతో
నేను కూడ ఆగిపోనా తనతో
నా ప్రాణం ఉంది తన వెంటే
నా ఊపిరుంది తాననంటే
కళ్ళార చూసానంటు వుంటే
ఎట్టా నమ్మేది స్వప్నమంటే

వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా

ఎక్కడున్నావమ్మా ఓ


ఎక్కడున్నావమ్మా ఓ
ఒకరికి ఒకరు (2003)
చంద్రబోస్
కీరవాణి
బాలు

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేశం కాని దేశంలో సాగరంలాంటి నగరంలో
ఎప్పుడు ఎదురొస్తావో నా యదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పుచ్చుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి గురజాడ
సుబ్బలక్ష్మి చెరుకూరి సుబ్బలక్ష్మి దగ్గుబాటి
సుబ్బలక్ష్మి పోసాని సుబ్బలక్ష్మి బెల్లంకొండ
సుబ్బలక్ష్మి సానా సుబ్బలక్ష్మి కోడూరి
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా

అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని ఛాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటే తెలుసు ఊరువాడ ఏమిటో
మాట మధురిమొకటే తెలుసు ఫోను నంబరేమిటో
అక్కడి చిలకను అడిగితే నువు సప్త సముద్రాలవతల ఉంటున్నావని చెప్పిందే
మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ ఇంగ్లీష్ చిలక నీ ఆచూకి తెలుపగ లేకుందే
ఎవరిని అడగాలి ఎలా నిను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోన
సుబ్బలక్ష్మి నండూరి
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా

ఫస్టుటైము డైలు చేయగా అష్టలక్ష్మి పలికెరా
రెండోసారి రింగు చేయగా రాజ్యలక్ష్మి దొరికెరా
హోయ్.. మరోమారు ట్రైలు వేయగా మహాలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మ తిట్టెరా
ఎదురుదెబ్బలే తగిలినా నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్టరునవుతాన్లే
కరి మబ్బులెన్ని నను కమ్మినా నా నెచ్చెలి నింగికి నిచ్చెన వేసి చేరువవుతాలే
నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమా
సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినేని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినేని సుబ్బలక్ష్మి మిద్దె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్టా
సుబ్బలక్ష్మి కైకాలా
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా