Showing posts with label ఊర్వశి (1974). Show all posts
Showing posts with label ఊర్వశి (1974). Show all posts

ప్రతి అందం జంటకోసం

తెలుగు చిత్రంలో మొట్టమొదటి సారిగా సంజీవ్‌కుమార్ శారదతో నటించిన ఊర్వశి (1974) చిత్రంలోని ఈ పాట మీకోసం


ప్రతి అందం
సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,వాణిజయరాం

పల్లవి::

ప్రతి అందం జంటకోసం పలవరించిపోతుందీ
జతగూడే బ్రతుకులోనే..జతగూడే బ్రతుకులోనే..
ప్రతి రాగం పలుకుతుందీ..
అనురాగం పండుతుందీ..అనురాగం పండుతుందీ
ప్రతి అందం జంటకోసం పలవరించిపోతుందీ

చరణం::1

కొండ కోరుకొంటుందీ కలికి మబ్బు జంటనూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కడలి కోరుకొంటుందీ కన్నెవాగు జంటనూ
కన్నెదాని పరువం కోరుకొంటుంది
చిన్నవాని జంటనూ చినవాని జంటనూ
ప్రతి అందం జంటకోసం పలవరించిపోతుందీ

చరణం::2

పెదవి కోరుకొంటుందీ మరో పెదవి జంటనూ
అహా..ఓహో..లలలలా..ఆ ఆ
మేను కోరుకొంటూందీ మరో మేని జంటను
వలచిన హృదయం కోరుకొంటుందీ
తొలివలపు పంటనూ..తొలివలపు పంటనూ
ప్రతి అందం జంటకోసం పలవరించిపోతుందీ

చరణం::3

రాధాకృష్ణుల జంట రసజగతికి తొలివెలుగు
సీతారాములజంట ఆ వెలుగుకే కనువెలుగు
ఆ వెలుగే మన జీవన పదము
సాగిపోదాములే..సాగిపోదాములే
ప్రతి అందం జంటకోసం పలవరించిపోతుందీ
జతగూడే బ్రతుకులోనే జతగూడే బ్రతుకులోనే
ప్రతిరాగం పలుకుతుందీ అనురాగం పండుతుందీ
అనురాగం పండుతుందీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ