తోలుతిత్తి ఇది

పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపథ్యగానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం 

పల్లవి : 

తోలుతిత్తి ఇది 
తూటులు తొమ్మిది
తుస్సుమనుట ఖాయం

ఓ జీవా తెలుసుకో అపాయం

చరణం 1:

ఉబ్బుతబ్బులై ఉరుకులుతీయకు
గబ్బు మేను జీవా 
అవును గబ్బిలాయి జీవా

ఎంతచెప్పినా ఏమిచెప్పినా
కట్టెలపాలౌ పాడు కట్టెరా 

తోలుతిత్తి

చరణం 2:

మూడురోజులా ముచ్చటరా 
ఈ చింతకట్టె దేహం
కాయం బుగులిపోవు ఖాయం

నువు కట్టుకుపోయేదొట్టిదిరా
ఈ మట్టిని పుట్టి మట్టిన కలిసే 

తోలుతిత్తి

చరణం 3:

వెలుతురుండగా తెరువు చూసుకో
తలచి రామ నామం
జీవా చేరు రంగధామం 

పట్టుబట్టి ఈ లోకపు గుట్టు
రట్టు చేసే ఈ రంగదాసుడూ 

తోలుతిత్తి

No comments:

Post a Comment

Leave your comments