May 22, 2021

ఆపద మొక్కులవాడా



ఆపద మొక్కులవాడా 
నిండు మనసులు (1967)
గానం: సుశీల 
రచన: సినారె 
సంగీతం: టి.వి.రాజు 

పల్లవి:

ఆపద మొక్కులవాడా 
ఓ శ్రీనివాసా... 
ఆపద మొక్కులవాడా 
ఓ శ్రీనివాస... 
అడుగడుగున కాపాడే 
తిరుమలగిరివాసా 
శ్రీనివాసా శ్రీనివాసా 

చరణం 1:

జనులందరు 
నీ చల్లని కనుపాపలే 
జగమంతా వెల్లివిరిసె నీ చూపులే 
జనులందరు 
నీ చల్లని కనుపాపలే 
జగమంతా వెల్లివిరిసె నీ చూపులే 

నిను నమ్మిన దీనుల 
కన్నీటి పిలుపు వినక 
కొండపై నిండుగా 
కొలువై ఉన్నావా?

ఆపద మొక్కులవాడా 
ఓ శ్రీనివాసా... 
శ్రీనివాసా... శ్రీనివాసా 

చరణం 1:

నిండు మనసు గలవారికి 
నిందలు మిగిలేనా 
నిండు మనసు గలవారికి 
నిందలు మిగిలేనా 
మంచిని కోరే బతుకే 
మంటల పాలేనా 
వెలుగులు చిలికే దీపం 
విలవిల లాడేనా 
దేవా దేవా నీకిది న్యాయమా 

గుండె నిండా వెతలు దాచి 
కుమిలిపోతి గానీ 
కొంగు చాచి ఎన్నడేమి
కోరలేదు స్వామీ 
అతని ప్రాణములను నిలిపి 
ఆదుకోవయ్యా... 
అందుకు నా ప్రాణములే 
అర్పించెదనయ్యా 
శ్రీనివాసా...
శ్రీనివాసా...
శ్రీనివాసా...