Showing posts with label పిచ్చి పుల్లయ్య (1953). Show all posts
Showing posts with label పిచ్చి పుల్లయ్య (1953). Show all posts

December 24, 2019

ఆలపించనా అనురాగముతో

ఆలపించనా అనురాగముతో
చిత్రం: పిచ్చి పుల్లయ్య (1953)
గీతరచయిత: అనిసెట్టి సుబ్బారావు
నేపధ్య గానం: ఘంటసాల
సంగీతం: టి.వి.రాజు

పల్లవి:

ఆలపించనా అనురాగముతో...
ఆలపించనా అనురాగముతో...
ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా...
ఆలపించనా... ఆలపించనా

చరణం 1:

చక్కని పూవులు విరిసి ఆడగా...
చల్లని గాలులు కలిసి పాడగా
పున్నమి వెన్నెల పులకరించగా...
పుడమిని సుఖాలు పొంగులెగయగా...
ఆలపించనా

చరణం 2:

చిలిపి గుండెలో వలపు నిండగా...
చిరునవ్వులలో సిగ్గు చిందగా
చిలిపి గుండెలో వలపు నిండగా...
చిరునవ్వులలో సిగ్గు చిందగా
అరమరలెరుగని అమాయకునిలో...
అరమరలెరుగని అమాయకునిలో
ఆశయాలెవో అవతరించగా...
ఆశయాలెవో అవతరించగా
ఆలపించనా....

చరణం 3:

కరుణ హృదయమే తాజ్ మహల్గా...
అనంత ప్రేమకు ఆశ చెందగా
కరుణ హృదయమే తాజ్ మహల్గా...
అనంత ప్రేమకు ఆశ చెందగా
నిర్మలప్రేమకు నివాళులెచ్చే...
నిర్మలప్రేమకు నివాళులెచ్చే
కాంతిరేఖలే కౌగలించగా....
కాంతిరేఖలే కౌగలించగా
ఆలపించనా ...

ఆలపించనా అనురాగముతో...
ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా...
ఆలపించనా