నీలి నీలి ఆకాశం
30 రోజుల్లో ప్రేమించడం ఎలా (2020)
అనూప్ రూబెన్స్
చంద్రబోస్
సిద్ శ్రీరామ్, సునీత ఉపద్రష్ట
అమ్మాయ్ గారూ ఎక్కడికెళ్ళి పోతున్నారు?
కాసేపుండొచ్చు గదా
ఆహాఁ...కాసేపాగితే
అబ్బాయ్ గారు ఏమిత్తారేమిటీ?
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా ఓ.. ఓ..
నీ నవ్వుకు సరిపోదంటున్నా ఆ.. అ..నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
చరణం 1:
ఓ.. ఒ.. వానవిల్లులో ఉండని రంగు నువ్వులే
ఏ రంగున చీరను నీకు నెయ్యా..లే
నల్లమబ్బులా మెరిసే కళ్ళు నీవి లే
ఆ కళ్ళకూ కాటుకా ఎందుకెట్టా..లే
చెక్కిలి పై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టా..లే
ఏదో ఇవ్వాలి కానుకా
ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదికా
అంటూ ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా
చరణం 2:
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా
ఓహొ అమ్మ చూపులో
ఒలికె జాలి నువ్వు లే
ఆ జాలికీ మారుగా ఏమి ఇవ్వాలి
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి
దయగలిగిన దేవుడే.. మనలను కలిపాడులే
వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే
ఏదో ఇవ్వాలి కానుకా
ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదికా
అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్లి మళ్లి జన్మనెత్తి నిన్ను చేరన
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా..