ఎదలో తొలివలపే
చిత్రం: ఎర్ర గులాబీలు (1979)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి
పల్లవి:
లలలలల లా..
ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే
నీ పిలుపే..ఏ..ఏఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే
నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలివలపే..
చరణం 1:
రోజాలతో పూజించనీ..
విరితేనెలే నను తాగనీ
నా యవ్వనం పులకించనీ..
అనురాగమే పలికించనీ
కలగన్నదీ నిజమైనదీ..
కధలే నడిపిందీ..ఈ..ఈ..
ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే
నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలివలపే..
చరణం 2:
పయనించనా నీ బాటలో..
మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలి రేయిని..
కొనసాగనీ మన జంటనీ
మోహాలలో మన ఊహలే..
సాగే చేలరేగే..ఏ..ఏ..
ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే
నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే
నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలి వలపే...