March 24, 2020

మన్నేల తింటివిరా కృష్ణా


మన్నేల తింటివిరా కృష్ణా
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: టిప్పు , స్మిత, కళ్యాణి మాలిక్

శ్రీ కనకమహాలక్ష్మికీ.... జై
శ్రీ సింహాచలం నరసింహస్వామికీ... జై
శ్రీ అన్నారం సత్యన్నారాయణస్వామికి... జై
శ్రీ రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజశ్రీ
పసలపూడి పంకజం గారి
పరమకళా రసిక నాట్యమండలికీ.... జైఅంచేత ఆడియన్సు లారా
రసిక శిఖామణులారా
వాసికెక్కిన వైజాగు వాసులారా
మన్ను తిన్న కృష్ణయ్యను
మందలించిన యశోదమ్మతో
ఆ వెన్న దొంగ
నువ్వు తొక్కవయ్యా హార్మోనీ
పోలీస్ బాబుగారు కూడ చూస్తన్నారు

అన్నయ్య బాలూరు బొల్లూలు చెప్పిరిగాని
ఏ పాపమెరుగానే తల్లీ
ఎల్లెస్ ఏటిరా ఈ ఎదవ గోల
నేను మన్నసలే తినలేదే తల్లీ
ఏయ్.... అబద్ధాలాడతావ్
మన్ను తిండానికి నీకేం ఖర్మ పట్టిందిరా...
నీకు వెన్నల్లేవా.... జున్నుల్లేవా
అరిసెల్లేవా... పోనీ అటుకుల్లేవా...
నీకు నీకు...
ఏటవుతుందిరా..?
నీకు పంచదార పూరీలు లేవా
నీకు మిరపకాయ బజ్జీలు లేవా
నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా
లడ్డూ మిఠాయి నీకు
లడ్డూ మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా
లడ్డూ మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా

చరణం 1:

పొద్దుకాల తరిపిదూడా
పొదుగుపాలు తాగబోతే
ఆ... తాగబోతే
లాగిపెట్టి తన్నిందే 
మట్టి మూతి కంటిందే

అయ్యయ్యో....
ఉల్లి పెసరట్లు లేవా
రవ్వా మినపట్లు లేవా
అప్పాలు లేవా.... పప్పులు లేవా
కొట్టిన కొబ్బరిచిప్పలు లేవా....
నీకు కాకినాడ కాజాలు లేవా...
నీకు మైసూరు బోండాలు లేవా...
నూని బందారు లడ్డూలు లేవా.....
ఆహా ఆత్రిపురం పూత్రేకులు లేవా...
రంగు జాంగిరి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా

చరణం 2:

ఏటిగట్టు తోటలోనా
మొక్కనాటి నీరు పెట్టి
ఎరువు మీద ఎరువేసి
ఏపుగా పెంచినట్టి
చెక్కరకేళి గెలలు లేవా....
పంపర పనస తొనలు లేవా.....
పూరిల్లేవా.... బూరెల్లేవా....
తేనెలూరు చిల్లి గారెల్లేవా....
నీకు కాశ్మీరు యాపిల్సు లేవా...
అరెరే పాలకొల్లు బత్తాయి లేదా...
నీకు వడ్లమూడి నారింజ లేదా...
అయ్యో కాబూలు దానిమ్మల్లేవా...
పాలా ముంజెలు నీకు పరువముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
నువ్ మన్నేల తింటివిరా కృష్ణా