April 7, 2020

గుసగుసలాడే పదనిసలేవో


గుసగుసలాడే
జెంటిల్ మెన్ (2016)
మణిశర్మ
రామజోగయ్యశాస్త్రి
కార్తీక్, ప్రణవి

గుసగుసలాడే పదనిసలేవో
తొలివలపేమో బహుశా...
తొణికిసలాడే మిసమిసలెన్నో
జతపడిపోవే మనసా...
ఎదో జరుగుతోంది..అదే ఆనందంలో..మరేం తెలియని..
అలజడి..అలజడి..అలజడి..
అలజడి..అలజడి..అలజడి..
అలజడి..అలజడి..అలజడి..
అలజడి..అలజడి..అలజడి..

గుసగుసలాడే పదనిసలేవో
తొలివలపేమో బహుశా...
తొణికిసలాడే మిసమిసలెన్నో
జతపడిపోవే మనసా...

చరణం 1:

తెలిసేలోపే అలా ఎలా
కదిలించావో ప్రేమనీ...
పిలిచేలోపే సరేనని
కరుణించావే రమ్మనీ...
చెరో కొంచెమై ఓ ప్రపంచమై
వరించే వసంతం ఇది...
అలజడి..అలజడి..అలజడి..
అలజడి..అలజడి..అలజడి..
అలజడి..అలజడి..అలజడి..
అలజడి..అలజడి..అలజడి..

చరణం 2:

నయగారాన్నే నవాబులా
పరిపాలించు కౌగిలై..
బిడియాలన్ని విడేంతలా
వయసందించు వెన్నెలై..
పెదాలంచులో ప్రేమరాతలా
ముద్దుల్లో ముంచింది ఇదీ..
అలజడి..అలజడి..అలజడి..
అలజడి..అలజడి..అలజడి..
అలజడి..అలజడి..అలజడి..
అలజడి..అలజడి..అలజడి..