శీతాద్రి శిఖరాన



శీతాద్రి శిఖరాన
శ్రీ లలితా హారతి
గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
రచన: బేతవోలు రామబ్రహ్మం
సంగీతం: టి. నాగరాజ్

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు |
మా తల్లి నత్తుకకు నీరాజనం _
కెంపైన నీరాజనం
భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి |
బాగైన అందెలకు నీరాజనం _
బంగారు నీరాజనం
భక్తి పొంగారు నీరాజనం

సీరెల్ కావలెనా – రయికల్ కావలెనా


సీరెల్ కావలెనా – రయికల్ కావలెనా
వర్గం: జట్టిజాం పాట

పాడటానికి అనువైన రాగం: హిందుస్తాని తోడి రాగస్వరాలు (ఆదితాళం)

అందమైన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పడుచు.
అందుకే బావ చీరెలూ, సొమ్ములూ తెచ్చిస్తానని సెప్పినా వద్దంటుంది ఆ మరదలు పిల్ల.
ఆ మరదలు పిల్ల మనసులోని మాటను జానపదులు ఇలా పాటలా పాడుకుంటారు…

సీరెల్ కావలెనా – రయికల్ కావలెనా
నీకేం కావాలనే మైదుకూరు సంతలోనా

సీరల్ నా కొద్దురో – రయికల్ నా కొద్దురో
నీవే నీవే నీవే కావాలరో రంగమ్మత్త కొడుకా

కమ్మల్ కావలెనా – కడియాల్ కావలెనా
నీకేం కావలనే పొద్దుటూరు సంతలోనా

కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా..


కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా..
గానం: మునెయ్య
సంగీతం: జి. ఆనంద్

కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా..
ఆ మాటలంటదే కోడిపిల్ల

ఆ.. మాటలంటదే
ఆ..లాగనంటదే
ఆ..మైన అంటదే
ఆ.. లయ్యబడ్తదే కోడిపిల్ల!

కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి
కైలాసం నేనూ పోయినానంటదే
ఆ మాటలంటదే కోడిపిల్ల!!

దిబ్బమీదికొంచబోయి …
బొచ్చు గిచ్చు ఈకుతాంటే (౩)
అహా.. సిలంకూరి సిన్నప్ప.. శవరం సేసినానంటదే (2)

తుమ్మేదలున్న యేమిరా... దాని కురులు


తుమ్మేదలున్న యేమిరా... దాని కురులు
గానం: మునెయ్య, వనజ
సంగీతం: జి. ఆనంద్

అతడు : తుమ్మేదలున్న యేమిరా... దాని కురులు
కుంచెరుగుల పైన - సామంచాలాడెవేమిరా

ఆమె : ఏటికి పోరా శాపల్‌ తేరా - బాయికి పోరా నీళ్లు తేరా
బండకేసి తోమర మగడ - సట్టికేసి వండర మగడా
శాపల్‌ నాకు శారూ నీకూరా
ఒల్లోరె మగడా! బల్లారం మగడా
బంగారం మగడా... అహ
శాపల్‌ నాకు శారూ నీకూరా || తుమ్మేద ||

అనుకుంటే కానిది ఏమున్నది

అనుకుంటే కానిది ఏమున్నది
ఔనన్నా కాదన్నా (2005)
కులశేఖర్
ఆర్పీ పట్నాయక్

అనుకుంటే కానిది ఏమున్నది
మనిషనుకుంటే కానిది ఏమున్నది
చలి చీమే ఆదర్శం
పని కాదా నీ దైవం
ఆయువే నీ ధనం
ఆశయం సాధనం
చేయరా సాహసం నీ జయం నిశ్చయం

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ


శ్రీ వరలక్ష్మి హారతి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
రాగం: మధ్యమావతి
తాళం: ఆది

పల్లవి: 

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి

అను పల్లవి :

ఎట్లా నిన్నెత్తుకొందు
ఆట్లాడే బాలవునీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి
కోట్లా ధనమిచ్చే తల్లి
||ఎట్లా నిన్నెత్తు||

వస్తావట్టిది పోతావట్టిది


మంగళంపల్లి బాలమురళి గారు పాడిన తత్వాలు
-----వైరాగ్య తత్త్వం

వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
చేసిన ధర్మము, చెడని పదార్ధము చేరునే మీవెంట.
(పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా)

చేతిలో అమృతము ఉన్నంతసేపే అన్నదమ్ములంటా
ఆగాధంబై పోయేనాడు ఎవరు రారు వెంటా
(చేతిలో బెల్లం ఉన్నవరకే చీమ బలగమంట
చేతిలో బెల్లం చెల్లితే ఎవరు రారు వెంట)

రారా సరసకు రారా


రారా సరసకు రారా
చంద్రముఖి (2005)
విద్యాసాగర్
భువనచంద్ర (వాలి )
నిత్యశ్రీ మహదేవన్, టిప్పు

రారా
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా

తోం తోం తోం
తోం తోం తోం

నవ్వాలమ్మ నవ్వాలి


నవ్వాలమ్మ నవ్వాలి
యమజాతకుడు(1999)
వందేమాతరం శ్రీనివాస్
సుద్దాల అశోక్ తేజ
కె.జె.ఏసుదాస్

నవ్వాలమ్మా నవ్వాలి
పువ్వులోలె నవ్వాలి
నవ్వాలమ్మా నవ్వాలి
పువ్వులోలె నవ్వాలి

మేనమామ నవ్వోలె
మళ్లీమళ్లీ నవ్వాలి
నూరేళ్ళు నువ్వు నవ్వంగ
దేవుళ్ళు చల్లగ చూడంగ
నూరేళ్ళు నువ్వు నవ్వంగ
దేవుళ్ళు చల్లగ చూడంగ

ఏడే ఏడేడే వయ్యారి వరుడు


వయ్యారి వరుడు
సఖి (2000)
ఏ ఆర్ రెహమాన్
వేటూరి
మహాలక్ష్మి అయ్యర్, వైశాలి, రిచా శర్మ

ఏడే ఏడేడే వయ్యారి వరుడు
ఎడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు (2)

సెంద్రుడున్న ఎన్నెలింట ఇంద్రుడొచ్చి బంతులెస్తే
లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా అవునా
చందనాల బొట్టందాలు సరదా సరదా నడకందాలు
పట్టు పంచ కట్టె వరుడేనా అవునా

ఏడే ఏడేడే

తళుకు తార వెన్నెల పాలేనోయ్ పారంగా
సంజె కన్ను మైకాలేలంట
ముద్దు గుమ్మ ఇక్కడ లేదండోయ్
చూడండోయ్ ముద్దు పొడుపు ఎట్టా చెప్పండోయ్