నోట్లోన వేలు పెడితే


నోట్లోన వేలు పెడితే
చిత్రం: మేడ మీద అబ్బాయి (2017)
సంగీతం: షాన్ రహ్మాన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వైకోమ్ విజయలక్ష్మి

నోట్లోన వేలు పెడితే
అస్సల్ కొరకనట్టు
గూట్లోన బెల్లం ముక్క
మింగేసి ఎరగనట్టు
ఫేస్ ని చూస్తే రాముడు
పనులు చూస్తే కృష్ణుడు
ఊరికొకడుంటే చాలు
ఈడి లాంటోడు

ఓ.. సుకుమారా..


ఓ.. సుకుమారా..
చిత్రం :  భార్యాభర్తలు (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓ.. సుకుమారా.. నను చేరా.. రావోయి.. ఇటు రావోయి..
నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే
నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే

ఓ.. జవరాలా.. ప్రియురాలా.. ఈనాడే.. మనదే హాయి
తనువుగ నేడు.. ఈ చెలికాడు.. నీ దరినే.. సుఖించునులే

భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా


అమర గాయకుడు "ఘంటసాల" వర్ధంతిసందర్భంగా, ఆయనకు
సమర్పిస్తున్న ఈ చిరు కానుక. జానకి గారు పాడారు. దేవ రాజు గారి రాసిన
ఈ పాట నాకు చాలా నచ్చినది మీరూ చదివి ఆనందిస్తారని కోరికతో....మీ ప్రసాద్

భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
స్థిరమైనది మా మది లో మధురమైన నీ గానము
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా

పదము లోని భావములు పదిలముగా మేళవించి
లాహిరి లో మమ్ములనూ కలవరింప చేసితివీ
కాదన లేనివీ మరువగ రానివీ
కాదన లేనివీ మరువగ రానివి
పాడిన నీ పాటలూ వినినంతనె తెలియునురా
వినినంతనె తెలియునురా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా

నెల్లూరి నెరజాణ



నెల్లూరి నెరజాణ
ఒకే ఒక్కడు (1999)
ఏ ఆర్ రెహమాన్
ఏ ఎం రత్నం, శివగణేష్
హరిహరన్, మహాలక్ష్మి అయ్యర్

నెల్లూరి నెరజాణ 
నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ 
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ 
నన్ను కొంచెం మార్చుకోవే

నెల్లూరి నెరజాణ 
నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ 
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ 
నన్ను కొంచెం మార్చుకోవే

నీ లేత గులాబీ పెదవులతో


నీ లేత గులాబీ పెదవులతో
చిత్రం: మా ఇంటి దేవత (1980)
సంగీతం : మాస్టర్ వేణు 
గానం: ఘంటసాల 

నీ లేత గులాబీ పెదవులతో
కమ్మని మధువును తాకాలి
లేత గులాబీ పెదవులతో
కమ్మని మధువును తాకాలి
విందులు చేసే నీ అందాలూ
నా మదిలోనే చిందాలీ
లేత గులాబీ పెదవులతో
కమ్మని మధువును తాకాలి

సుఖీభవ అన్నారు దేవతలంతా


సుఖీభవ
చిత్రం : నేనే రాజు నేనే మంత్రి (2017)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : రోహిత్, శ్రేయఘోషల్

సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళై  ఉండాలి ఈ జన్మంతా..

ఊపిరంతా నువ్వే నువ్వే
ఉహలోనా నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే బంధమా..
ఓ కంటిలోనా నువ్వే నువ్వే
కడుపులోనా నీ ప్రతిరూపే
జన్మకర్దం నువ్వే ప్రాణమా..
కలలోనా కథలోనా నువ్వే...
నీ జతలో నూరేళ్ళు ఉంటానే...

కనులు కనులు కలిసే సమయం


కనులు కనులు కలిసే సమయం
చిత్రం:  పల్లవి అనుపల్లవి (1983)
సంగీతం:  ఇళయరాజా
నేపధ్య గానం:  బాలు, జానకి

పల్లవి:

లలలా లలలా లలలా లలాలా
లలలా లలలా లలలా లలాలా
ఉహూహూ అహాహహా లలలలాలల లల

కనులు కనులు.. కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో.. వినిపించెను శ్రీ రాగం

కనులు కనులు.. కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక


తెలుసునా తెలుసునా
సొంతం (2003)
కె.ఎస్.చిత్ర
దేవిశ్రీ ప్రసాద్
సిరివెన్నెల

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది  ఎలా ఎలా దాన్ని ఆపేది
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

ఎంతెంత దూరం? తీరం రాదా

ఎంతెంత దూరం? తీరం రాదా
సైనికుడు (2006)
వేటూరి
హ్యారిస్ జయరాజ్
బాలు, ఉన్నికృష్ణన్

ఎంతెంత దూరం తీరం రాదా 
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమగాధ 
నీ వైపు మళ్ళిందంటే మాయేగా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా 
ఊరించే ఊహాలోకం లేరా
మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా 
రంగంటూ లేనేలేదు లేరా

ఊహల్లో ఊసుల్లో ఆమాటే ఓసోసి గొప్ప ఏముంది గనకా
తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా
అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా
ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా
మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా నీ చెంతే ఉండే దూరం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వు ఎంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా
శిలవా నా మాట వినవా ఏనాడు నువ్వు ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే

ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా

సొగసు చూడ తరమా


సొగసు చూడ తరమా
సైనికుడు (2006)
వేటూరి
హ్యారిస్ జయరాజ్
శ్రేయాగోషాల్

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ  ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా