తెలంగాణా జానపదం (2024)
సాహిత్యం: లావణ్య రవీందర్
సంగీతం: వెంకట్ అజ్మీరా
గానం: ప్రభ
పల్లవి :
నిమ్మతోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి
ముత్యాలదండలిత్తవ
మురిపెంగ నన్ను చూత్తవా
ముత్యాలదండలిత్తవ
మురిపెంగ నన్ను చూత్తవా
నిమ్మతోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి