August 2, 2025

నా పేరే ఎల్లమ్మ

తెలంగాణా అమ్మవారి పాట 
డీజీ లింగా
సాహిత్యం: రాజేందర్ కొండా 
గాయని: ప్రభ 
సంగీతం: మదీన్ ఎస్కె 

నా పేరే ఎల్లమ్మ 
నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా 
నన్ను జోలాజోలంటి…
ఆరుగంపల్లా 
నేను ఆడినదాన్నమ్మో …
అందరి ముంగట 
నేను అమ్మవారునే…
కలియుగములోన 
కన్నెమాతానంటిరే…
ఎయ్యో యాపశెట్టంటి 
నాకు ఇంపుగాయెనే…
నా పేరే ఎల్లమ్మ 
నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా 
నన్ను జోలాజోలంటి…

అ సెరుకట్ట మీది 
అమ్మి కట్టమైసినే….
నీ ఇంటి ముంగట
నే సుట్టామైతినే…
ఆ ముల్లోకాలేలే 
అ ముత్యాలమ్మనే…
నన్ను సెరనన్నోలకి 
నేను షరుతులిద్దునే….
అయ్యొ కోరినోళ్లకు 
నేను కొడుకులిద్దునే….
నన్ను అడిగినోళ్లకు 
ఆడబిడ్డలనిద్దునే…..
నా పేరే ఎల్లమ్మ 

అ మర్రి సెట్లల్లా 
నే మావురాలినే…..
ఆ ఒర్రెల ఒంపుల్లా 
నే ఒడ్డుకుంటినే…
సుట్టు సెట్టు సెలకల్లా 
నేను సక్కని తల్లినే….
ఆ గట్టు మీదున్న…
గౌండ్లాడి బిడ్డనే……
ఆ మందొడ్డకు నేను 
మారెమ్మ తల్లినే…..
ఆ గంగొడ్డుకు నేను 
గావురాల తల్లినే……
నా పేరే ఎల్లమ్మ 

తీరొక్క పేరు 
నాది తీరు బంగారు…
తిరుగారం గోల 
నాకు తీరుతమిద్దురు…
అయ్యో ఆషాఢం వేళా
నాకు ఆరతులిద్దురు…..
అడ్డెడు బియ్యమ్ము 
నా ముంగట పోద్దురు…..
నా యాపరెల్లల్నీ
నాకు తోరణమిద్దురు..
ఆ యాటా పిల్లల్నీ
నాకు కానుకగిద్దురు…..
నా పేరే ఎల్లమ్మ 

నిమ్మకాయ దండలనే 
నాకు నిండుగేద్దురే…..
ఆ సీరే బట్టలనే 
నాకు సారే పోద్దురే…..
నా అక్క సెల్లెల్లే 
నాకు పాటలు పాడుదురే….
నా అకిట్ల అలికి….
బొట్ల పట్నాలేద్దురే…..
అమ్మ శరణు శరణంటూ 
మాట సాగదీద్దురే…
తల్లి శరణాలే అంటూ…
నన్ను ఆరాదిద్దురే…
నా పేరే ఎల్లమ్మ