తెలంగాణా జానపదం
సాహిత్యం, గాయకుడు: కొంగరి కృష్ణ
గాయని: ప్రభ
సంగీతం: మహేష్ చింతల్ బోరి
పల్లవి :
అబ్బబ్బ పోరడు ఏమున్నడే
గా రింగూలజుట్టోడు బాగున్నడే
అబ్బబ్బ పోరడు ఏమున్నడే
గా రింగూలజుట్టోడు బాగున్నడే
రమ్మంటడే వాడు పొమ్మంటడూ
గుట్టాకు రమ్మాని గుంజూతడు
అబ్బ రాను.. అబ్బ రాను
రాను రాను రాను
నీ యెంట నేను రాను
రాను రాను రాను
ఓ పిలగా ఓ అరుణు
అబ్బ రాను రాను అంటది
అది మందిల నన్నే చూస్తది
అరె చెయ్యి సైగ నాకు చేస్తది
ఆ ఎత్తూ సెప్పులా చిన్నది
గుణగుణ అరె గుణగుణ
గుణగుణ పోయేటి వయ్యారిభామ
మనసుదోచకే బంగారుబొమ్మ
గుణగుణ పోయేటి వయ్యారిభామ
మనసుదోచకే బంగారుబొమ్మ
రాయే రాయే పిల్ల
నా మనసు దోచె రసగుల్ల
చరణం 1:
మా ఊరి మల్లన్న గుడికాడ పిల్లా
రంగు గాజులట ఇప్పిస్త మల్లా
గాజూలియ్య బావలున్నారు రయ్యా
మందీలున్న బందుకు జరుగయ్యా
మల్లేపెల్లి మల్లెపూలట పిల్లా
అల్లీపెడత నీ సిగల్లా మల్లా
మల్లేలియ్య మావలున్నారురయ్యా
మాట మాట జర కలపకురయ్యా
రాయే..
నే రాను
అబ్బ రాయే..
ఎహే రాను
నే రాను రాను రాను
నీ యెంట నేను రాను
రాను రాను రాను
ఓ పిలగా ఓ అరుణు
చరణం 2:
ఛార్మినారు నీకు రాసిస్త పిల్లా
నా యెంట రావే మరదలు పిల్లా
ఆహా నాకు తోడ చెల్లెళ్ళున్నారు రయ్యా
జూఠా మాటలాపి నువ్వెళ్ళురయ్యా
సిద్దీపేట చిలక పలుకుల దాన
సైకిలెక్కి ఎళ్లిపోదామే జాన
నిర్మల్లోన ఓ చిన్నవాడా
యెంటా పడకురా నా కొంగు చూడ
రాయే..
నే రాను
అబ్బా రాయే..
నే రాను
రాను రాను రాను
నీ యెంట నేను రాను
ఎహే రాను రాను రాను
ఓ పిలగా ఓ అరుణు
చరణం 3:
కరీంనగర్ కాటుకాట పిల్లా
పెట్టూకోవె మెరిసే కన్నులల్లా
నా కన్నుల్ల కన్ను పెట్టకురయ్యా
వరసకు నువ్వు నా మేనబావయ్యా
నిర్మల్ బొమ్మలున్నావే పిల్లా
యెంట రావే కూడి పోదాము మల్లా
మనసిచ్చినారా మనువాడుకోరా
ఓ బావ రారా పింఛమ్ పిల్లోడా
రాయే..
అబ్బా రాయే
ఎహే రాయే..
నువ్వు రారా
రారో రారో రారో
నా యెంట నువ్వు రారో
రారో రారో రారో
ఓ పిలగా అరుణు రారో