Showing posts with label కోరుకున్న ప్రియుడు (1997). Show all posts
Showing posts with label కోరుకున్న ప్రియుడు (1997). Show all posts

కోయిలమ్మ నోట

కోయిలమ్మ నోట
కోరుకున్న ప్రియుడు (1997)
చంద్రబోస్
కోటి
చిత్ర, బాలు, శైలజ

కోయిలమ్మ నోట
కొంటెగాలి పాట
జనించగా
సరదాగా సాగే ఆటా పాటా

నవరస నటనా సార్వభౌమను నేను
నీరసమొచ్చినా నీరుగారి పోను
చూపొద్దే ఓ ఆలీ
నీవు నాపై జాలి
ఈ ఆట నాకో లెక్కా
చూపిస్త నా తడాఖా
ఓడావు ఆడలేకా
పెట్టొద్దు గావుకేకా

రెప్పపాటులో వెన్నుపోటుతో
కుప్పకూలె నా కోటా
చెప్పకూడని నొప్పి పెంచగా
కొంపముంచె ఈ ఆటా
ఇహ నాలో ఓపిక ఛస్తే లేదండీ
ఇక మీలో మీరే కుస్తీ పట్టండీ
అసలెందుకు మాతో పందెం చెప్పండీ
పసలేనోళ్ళంతా పక్కకు జరగండీ

మా శుభగాత్రి
మామకు మంత్రి
కళలకు అభినేత్రీ
అపజయమంటే జయముకు నాందీ
ఓటమి వెంటే గెలుపొకటుంది
ఆటకు విడుపేదీ

వామ్మో వార్నాయనో పాయ
అంతా పాయా
సీటూ పాయా చోటూ పాయా రూటే లేదాయే
పోటీ లోనా అవుటై పోయి
మాటే రాదోయీ
కుర్చీ కోసం చూస్తీ
యమకష్టాలే భరిస్తీ
పీటీ ఉషను మించి ఇక
పోటీ పరుగు తీస్తీ
ప్లేసే లేకా ఆశే లేకా కేసే చేదాయే పాయె
మాకే విందాయే
నీ లైఫే సంతాయే

ఏయ్ నిన్నే అరే
ఏదో ఏదో కావాలా
నువ్వో నేనో తేలాలా
పిచ్చి పరుగింక ఎందాకా
వచ్చి వాలింది కన్నె తారక
ఏదో ఏదో కావాలా
నువ్వో నేనో తేలాలా
పిచ్చి పరుగింక ఎందాకా
వచ్చి వాలింది కన్నె తారక

చిందులేసే నంటా చిన్నా పెద్దా అంతా
సందడైన ఇంట సంతోషాల పంట
భోగాలూ భాగ్యాలూ సరసాలూ సౌఖ్యాలు
మనసైన బంధాలు
నిలవాలి నూరేళ్ళు
మనసైన బంధాలు
నిలవాలి నూరేళ్ళు

కొంగుపట్టి లాగాడే

కొంగుపట్టి లాగాడే
కోరుకున్న ప్రియుడు (1997)
సిరివెన్నెల
కోటి
చిత్ర, బాలు

కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు
అందె గట్టి ఆడేనే అందగత్తె హొయలు
మోగే సన్నాయి తోన సుముహూర్తం చేరిందనీ
కాగే కౌగిళ్ళలోన శుభకార్యం కానుందని
చందమామే అంది ఎద సంద్రమై పొంగింది
ఆ నింగీ నేలా ఏకం చేసే ఆనందంలో
కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు
అందెగట్టి ఆడేనే అందగత్తె హొయలు

చరణం 1:

ఎదురు చూసే ఆషాడమేఘం
చెలిమి జల్లై చేరే వేళ
పురులు విరిసి తనువు మెరిసే
వలపు హరివిల్లుగా

ఎదను మీటే కళ్యాణరాగం
చిలిపి గీతం పాడే వేళా
వధువు ప్రాయం నిదుర లేచే వరద గోదారిలా
ముచ్చట తీర్చగ ముందుకు వచ్చిన అనురాగమా
వెచ్చని వేడుక ముంగిట వేచిన జతచేరుమా
సోయగాల సిరులు సుస్వాగతం అంటుంటే
ఆ నింగీ నేలా ఏకం చేసే ఆనందంలో
కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు
అందె గట్టి ఆడేనే అందగత్తె హొయలు

చరణం 2:

నిమిషమైనా నిను వీడిపోక
నిలిచిపోనా నా శశిరేఖ
పగడమంటి పెదవిపైన చలువ చిరునవ్వుగా

మనసునేలే మారాజువేగా
సొగసు రాజ్యం సొంతం కాదా
తనివి తీరా అణువు అణువు అందుకో కానుకా
ఆశల తోటకి ఆమని తెచ్చిన ఓ మేనకా
ప్రతి ఒక రేయి కౌగిలి పున్నమి కావాలిగా
కన్నె నాగై నన్ను నువ్వల్లుకుంటూ వుంటే
ఆ నింగి నేల ఏకం చేసే ఆనందంలో
కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు
అందె గట్టి ఆడేనే అందగత్తె హొయలు
మోగే సన్నాయి తోన సుముహూర్తం చేరిందని
కాగే కౌగిళ్లలోన శుభకార్యం కానుందని
చందమామే అంది ఎద సంద్రమై పొంగింది
ఆ నింగీ నేలా ఏకం చేసే ఆనందంలో

ఓహో వయ్యారం

ఓహో వయ్యారం
కోరుకున్న ప్రియుడు (1997)
చంద్రబోస్
కోటి
చిత్ర, బాలు

ఓహో వయ్యారం వారెవ్వా నీ పరువం
ఓహో వయ్యారం వారెవ్వా నీ పరువం
ప్రేమపురానికి పరుగెడదాం
మదనపురాణం మొదలెడదాం
భలే బాగుంది చెలీ నీలో హొయా
ఇలా నువ్వు సై అంటే సదా షుక్రియా

ఛీ పో శృంగారం
వరసైన నీ సరసం
ఛీ పో శృంగారం
వరసైన నీ సరసం

వీనస్ వీణను మీటావు
బోనస్ గా మనసిచ్చాను
ఛలో రమ్మంటాలే కొంటె కోయిల
గులామై ఉంటా నీ గూటి లోపల
ఛలో రమ్మంటాలే కొంటె కోయిలా
గులామై ఉంటా నీ గూటి లోపల

చరణం 1:

నీ అందం మెచ్చిందే ఏపీ
నీ నవ్వే పెంచింది బీపీ
నా లవ్ లో నువ్వే వీఐపీ
కవ్విస్తే లైఫంతా హ్యాపీ
వలపు వరించే
వయసు తరించే
పడుచుదనంచే
మనసు చలించే

వలపు వరించే
వయసు తరించే
పడుచుదనంచే
మనసు చలించే

క్యూ కట్టీ నిల్చున్నాయ్ దాహాలు
ఊ కొట్టీ ఆర్పేసేయ్ దీపాలు
శివాలెత్తి పోతూంది కన్నెగోపికా
సవాలంటు ఇవ్వాలే కొంటె కానుక

ఓహో వయ్యారం వారెవ్వా నీ పరువం
ఛీ పో శృంగారం వరసైన నీ సరసం

చరణం 2:

పరిచేస్తా పరువాలే నీకు
సందిస్తే పైపైకి రాకు
అరువిస్తే నీ హాటు సోకు
అందిస్తా సరసాలే నీకు
తనువు తపించే
తపన దహించే
పెదవి లిఖించే
సఖియ సుఖించే

తనువు తపించే
తపన దహించే
పెదవి లిఖించే
సఖియ సుఖించే

చేపట్టు బరువెక్కే భారాలు
చూపెట్టు మురిపాల తీరాలూ
హలో అంటు నువ్వంటే మిలాయించనా
గిలే పెంచు ఈ ఆటా చలాయించనా

ఓహో వయ్యారం వారెవ్వా నీ పరువం
ఛీ పో శృంగారం వరసైన నీ సరసం

ప్రేమపురానికి పరుగెడదాం
మదనపురాణం మొదలెడదాం
భలే బాగుంది చెలీ నీలో హొయా
ఇలా నువ్వు సై అంటే సదా షుక్రియా
భలే బాగుంది చెలీ నీలో హొయా
ఇలా నువ్వు సై అంటే సదా షుక్రియా