July 28, 2025

సోలపురం బోయినాను

తెలంగాణా జానపదం
సంగీతం: మార్క్ ప్రశాంత్ 
గానం: దిలీప్ దేవగన్ – మణిశ్రీ 
సాహిత్యం: వసీమ్

పల్లవి: 

అరె సోలపురం బోయినాను 
సోలడొడ్లు తెచ్చినాను
అరె సోలపురం బోయినాను 
సోలడొడ్లు తెచ్చినాను
దంచనన్న దంచే...
ఆహా నేన్ దంచ పో
మా యమ్మగాని దంచే... 
ఉహు నేన్ దంచ పో

సోలపురం బోయి బలే 
సోకులవడి వచ్చినావు
సోలపురం బోయి బలే 
సోకులవడి వచ్చినావు
నేను దంచపోవోయ్
ఎందుకె నా సిత్రాంగి
ఒడ్లు దంచపోవోయ్
ఎందుకె నా అర్థాంగి

చరణం 1:

ఆ దంచకుంటె దంచకుంటివి 
నేనే దంచుకుంట గాని
దంచకుంటె దంచకుంటివి 
నేనే దంచుకుంట గాని
సెరుగనన్న సెరుగే
ఆహా నేన్ సెరగా పో
మా తల్లిగాని సెరుగే
ఉహు నేన్ సెరగా పో

నువ్వు దంచినొడ్లలోన 
ఎన్ని మెరిగలున్నయో
నువ్వు దంచినొడ్లలోన 
ఎన్ని మెరిగలున్నయో
నేను సెరుగపోవోయ్ 
అట్లంటే ఎట్లనే
బియ్యం సెరుగపోవోయ్
మరి ఏమొండి తిందమే

చరణం 2:

సెరగకుంటె సెరగకుంటివి 
నేనే సెరుక్కుంట గాని
సెరగకుంటె సెరగకుంటివి 
నేనే సెరుక్కుంట గాని
వండనన్న వండే 
ఆహా నేన్ వండ పో
మా యమ్మగాని వండే
ఉహు నేన్ వండ పో

పొయ్యి మీద వండితె 
నా కళ్ళకు పొగ వచ్చునయ్య
పొయ్యి మీద వండితె 
నా కళ్ళకు పొగ వచ్చునయ్య
నేను వండపోవోయ్
అయ్యో నా పెళ్ళమా
నువ్వే వండుకోవోయ్
అన్నం గూడొండవా

చరణం 3:

వండకుంటె వండకుంటివి 
నేనే వండుకుంట గాని
వండకుంటె వండకుంటివి 
నేనే వండుకుంట గాని
తిననన్నా తినవే
ఆహా నేన్ తినను పో
మా తల్లిగాని తినవే
ఉహు నేన్ తినను పో

పనులన్నీ చేసినా 
చేతులకు నొప్పులాయే
పనులన్నీ చేసినా 
చేతులకు నొప్పులాయే
నువ్వే తినబెట్టు
ఇక పట్టరాదె బంగారం
ముద్దుగా తినబెట్టు
సరేలే నా సింగారం

చరణం 4:

నీకేది కావాలన్న చెప్పు 
తోడుగ నేనున్నా
నీకేది కావాలన్న చెప్పు
తోడుగ నేనున్నాను
సరేనానే భామ
నువ్వు బంగారమే ఓ బావ
నీ మీదనే నా ప్రేమ
నువ్వే నాకు ధీమా

ఏ జన్మల పుణ్యమో 
నాకు భర్తగ నువ్వు దొరికినావు
ఏ జన్మల పుణ్యమో 
నాకు భర్తగ నువ్వు దొరికినావు
రాముడంటి ప్రేమ
సీత కష్టాలను పెట్టబోనే 
జీవితమే నీతో
కలకాలము కలిసుందామే