July 29, 2025

తాటిబెల్లం తైదరొట్టె

తెలంగాణా జానపదం 
రచన, గాయకుడు: నూకరాజు
గాయని: దేవకమ్మ
సంగీతం: వెంకట్ అజ్మీరా  

తిన నా మానసాయెరా 
తాటిబెల్లం తైదరొట్టె
తాటిబెల్లం తైదరొట్టె
తిన నా మానసాయెరా 
దేవుడో జందారుడా
మల్లెన్నడొస్తవ్ నాయానా 
నాయానో నారాయణా

బాధపడకు బెంగపడకు
బాధపడకు బెంగపడకు
ఇట్లవోయి అట్లొస్తనే
దేవకి నా నా సఖి
ఇట్లవోయి అట్లొస్తనే
దేవకి నా నా సఖి

భోనగిరి బొట్టుబిళ్ళ
భోనగిరి బొట్టుబిళ్ళ
పెట్ట నా మానసాయెరా 
దేవుడో జందారుడా
మల్లెన్నడొస్తవ్ నాయానా 
నాయానో నారాయణా

ఛార్మినార్ మట్టిగాజులు
ఛార్మినార్ మట్టిగాజులు
బుట్టనిండా తెస్తనే
దేవకి నా నా సఖి
ఇట్లవోయి అట్లొస్తనే
దేవకి నా నా సఖి

హైదరబాదు అద్దాలరైకే
హైదరబాదు అద్దాలరైకే
తొడగా నా మానసాయెరా 
దేవుడో జందారుడా
మల్లెన్నడొస్తవ్ నాయానా 
నాయానో నారాయణా

సిరిసిల్ల సిల్కుసీర
సిరిసిల్ల సిల్కుసీర
సక్కాని నీకు నేదెస్తనే
దేవకి నా నా సఖి
ఇట్లవోయి అట్లొస్తనే
దేవకి నా నా సఖి

కాళ్లపెల్లి కాళ్లపట్టీలు
కాళ్లపెల్లి కాళ్లపట్టీలు
పెట్ట నా మానసాయెరా 
దేవుడో జందారుడా
మల్లెన్నడొస్తవ్ నాయానా 
నాయానో నారాయణా

కాటలూరి కాళ్లకడియాలు
కాటలూరి కాళ్లకడియాలు
నీకాళ్లకు నే కొనితెస్తనే
దేవకి నా నా సఖి
ఇట్లవోయి అట్లొస్తనే
దేవకి నా నా సఖి

ఓయ్ దేవకీ మళ్ళొస్తనే..
ఏమొద్దు పో…

మాలపెల్లి మల్లెపూలు
మాలపెల్లి మల్లెపూలు
పెట్ట నా మానసాయెరా 
దేవుడో జందారుడా
మల్లెన్నడొస్తవ్ నాయానా 
నాయానో నారాయణా

పాతబస్తీ అత్తారు సీస
పాతబస్తీ అత్తారు సీస
నీమీద ప్రేమతొ నేదెస్తనే
దేవకి నా నా సఖి
ఇట్లవోయి అట్లొస్తనే
దేవకి నా నా సఖి

నల్గొండ నకిలీసు గొలుసు
నల్గొండ నకిలీసు గొలుసు
ఎయ్య నా మానసాయెరా 
దేవుడో జందారుడా
మల్లెన్నడొస్తవ్ నాయానా 
నాయానో నారాయణా

గోలుకొండ ముత్యాలగొలుసు
గోలుకొండ ముత్యాలగొలుసు
సక్కాని మెడకు నేదెస్తనే
దేవకి నా నా సఖి
ఇట్లవోయి అట్లొస్తనే
దేవకి నా నా సఖి

పట్టెమంచం పూలపాన్పు
పట్టెమంచం పూలపాన్పు
పాండ నా మానసాయెరా 
దేవుడో జందారుడా
మల్లెన్నడొస్తవ్ నాయానా 
నాయానో నారాయణా

మాఘమాసం మంచిరోజు
మాఘమాసం మంచిరోజు
మల్లెపూలు కొనితెస్తనే
దేవకి నా నా సఖి
ఇట్లవోయి అట్లొస్తనే
దేవకి నా నా సఖి
దేవకి నా నా సఖి
దేవకి నా నా సఖి