July 27, 2025

రఘుకులతిలకా రారా

రామ భజన 
గానం: కొండల స్వామి
సంగీతం: పసుపులేటి పవన్ శ్రీ  

పల్లవి : 

రఘుకులతిలకా రారా
నిన్నెత్తి ముద్దులాడెదరా 
రఘుకులతిలకా రారా 
నిన్నెత్తి ముద్దులాడెదరా
కోసల రామా రారా 
కౌసల్య రామ రారా
కోసల రామా  రారా 
కౌసల్య రామ రారా

రఘుకులతిలకా రారా

చరణం 1:

నుదిటిన కస్తూరి తిలకం 
చిరునవ్వులు చిందే అధరం
నుదిటిన కస్తూరి తిలకం 
చిరునవ్వులు చిందే అధరం
మల్లెలు మాలలు కట్టి 
నీ మెడలో వేసెద రారా
మల్లెలు మాలలు కట్టి 
నీ మెడలో వేసెద రారా

రఘుకుల తిలకా రారా 

చరణం 2:

వెండిగిన్నెలో పాలు 
అవి నీకై ఉంచితి రారా
వెండిగిన్నెలో పాలు 
అవి నీకై ఉంచితి రారా
అల్లరి చేయగ మాని 
నువ్వారగించగా రారా
అల్లరి చేయగ మాని 
నువ్వారగించగా రారా

రఘుకుల తిలకా రారా 

చరణం 3:

బుగ్గన చుక్క పెట్టీ 
నీ కనులకు కాటుక పెట్టీ
బుగ్గన చుక్క పెట్టీ 
నీ కనులకు కాటుక పెట్టీ
నా మనసును మాలగ చేసీ 
నీ మెడలో వేసేద రారా
నా మనసును మాలగ చేసీ
నీ మెడలో వేసేద రారా

రఘుకుల తిలకా రారా