మా కంటి జాబిలీ...
చిత్రం: మకుటంలేని మహారాజు(1986)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: రాజ్ సీతారామన్, సుశీల
పల్లవి :
మా కంటి జాబిలీ...
మా ఇంటి వెన్నెలా...
వెళ్ళిరా చల్లగా అత్తింటికి
వెళ్ళిరా చల్లగా అత్తింటికి
కడలింటికెళ్ళేటి కృష్ణవేణమ్మలా (కడలి ఇంటికి)
పాటతో దీవించె కొమ్మలో కోయిల
మా కంటి జాబిలీ
మా ఇంటి వెన్నెలా
చరణం 1 :
తారాడు మబ్బుల్లో ఆకాశమల్లే
నక్షత్ర నయనాలనే చూడనా
ఏడేడు జన్మాల అనుబంధమల్లే
హరివిల్లు చీనాంబరాలివ్వనా
మళ్ళీరా తల్లిగా పుట్టింటికి
దీవించుకుంటాను ఈ జన్మకింతే
కనరాని దైవాల కథలన్ని ఇంతే
చరణం 2 :
తొలిసంధ్య గోరింట పేరంటమల్లే
పాదాల పారాణి నే పూయనా
మలిసంధ్య మరుమల్లె సీమంతమల్లే
పులకింత పండించి పురుడోయనా
తోడుగా ఉండనా అన్నింటికి
ఒక కంటిలో పొంగ ఆకాశగంగ
ఒక గుండెలో పొంగె పాతాళగంగ
వెళ్ళిరా చల్లగా అత్తింటికి
వెళ్ళిరా చల్లగా అత్తింటికి