ఎద నట్టింటను మెట్టిందొక

ఎద నట్టింటను మెట్టిందొక
ప్రార్థన (1991)
రచన: సిరివెన్నెల
సంగీతం: దేవేంద్రన్ 
గానం: బాలు, జానకి 

పల్లవి:

ఎద నట్టింటను మెట్టిందొక మధు కథ
నర్తించెను మత్తిల్లిన సుమ సుధ  
రూపెత్తిన ఆనందం ఆగేనా?

ఎద నట్టింటను మెట్టిందొక మధు కథ
నర్తించెను మత్తిల్లిన సుమ సుధ  
రూపెత్తిన ఆనందం ఆగేనా?

దివి లక్షింతల అక్షింతలు కురియగ
నిద్రించని విద్యుల్లత విరియగ 
చేపట్టిన వాసంతం వాడేనా?

శుభమూర్తం పిలిచింది 
సురద్వారం తెరిచింది 
నవరాగం రాగా

ఎద నట్టింటను మెట్టిందొక మధు కథ
నర్తించెను మత్తిల్లిన సుమ సుధ  
రూపెత్తిన ఆనందం ఆగేనా?

చరణం 1:

నీలివనిలో తారకా
ఈ అవనికే జారగా
గాలి అలలే గానకళలై 
రేయి హృదయం పాడదా

వాలుకనులే కోరగా 
పూల కలలే చేరగా
తేనె తడిపే వేళ తలపే 
హాయి లయలో ఆడదా

వెలుగు నిజమైనా
వలపు ఋజువైనా
కళ్ళు మూసే చూడనీ వరాన్ని 
రెప్ప విడితె కల ఔనో

చరణం 2:

మల్లె మురిసే వేళగా
వెల్లివిరిసే వేడుకా
ప్రాణలతకు ప్రణయశృతిలో 
మేలుకొలుపై చేరదా

ఇంద్రధనువే మాలగా  
పేద ఎదపై వాలగా
భావి బ్రతుకు దేవి కొరకు 
పూజగదిగా మారదా

ఇలకు ఇకపైనా 
విరుల జడివానా
మౌనమైన రాగమాలపించు 
మరుల ఝరుల మురిపాన

No comments:

Post a Comment

Leave your comments