భద్రం కొడుకో
రంగుల కల (1983)
సంగీతం: నరసింగరావు
గానం: గద్దర్
భద్రం కొడుకో
నా కొడుకో కొమరన్న జరా
పైలం కొడుకో
నా కొడుకో కొమరన్న జరా
రిక్షా ఎక్కేకాడ దిగేకాడ
తొక్కుడు కాడ మలుపుకాడ
మన ఊరు గాని ఊరు
మన పల్లె గాని పల్లె
పల్లెల్లో పెద్ద దొరల బాధలతో ఏగలేక
పొట్టచేత బట్టుకోని పట్నమొచ్చినాంరో
పల్లెల్లో పెద్ద దొరల పట్నంలో పెదబాబుల
వాళ్ళ వీళ్ళ పట్టంతా ఒకటే కొడుకో
పెద్ద పెద్ద బంగ్లలల్ల పెద్దా పెంజరలుండు
నల్ల బాజారునిండా నల్ల నాగూలుండు
నలుగురు గూడిన కాడ నరలోకం యముడుండు
ఊరు ఒకటే పట్నమొకటే బాధలన్నీ మనకొకటే
పేదలున్న గుడిసెలెల్ల బాధలన్ని ఉన్నాయి
బాధలన్ని బోయేటి బాట ఒకటి ఉన్నాది
బాట చూసి బండి నడిపి కదులర కొడుకో
పల్లెల్లో చూస్తే జనం పట్నంలో చూస్తే జనం
గుణం తెలిసి జనంలోన కలువర కొడుకో
నువ్వూ కదులర కొడుకో
నువ్వూ నడువర కొడుకో