August 3, 2023

గుడి గంటలే జయమంటు

గుడి గంటలే  జయమంటు
రేపల్లెలో రాధ (2001)
సంగీతం: కోటి
గానం: స్వర్ణలత

పల్లవి:

గుడి గంటలే జయమంటు శుభమంటు మోగేనులే
జడ గంటలే జగమంత నాదంటు ఊగేనులే
పైరు పరవళ్ళు... ఏరు ఉరవళ్ళు
నింగి పందిళ్ళు... నేల సందెళ్ళు

గుడి గంటలే జయమంటు శుభమంటు మోగేనులే

చరణం 1:

కొండల్లో, కోనల్లో ఎన్నెన్నీ వన్నెలు పండేను
క్షణాల్లో పండగ జరిగేను
ఎండల్లో, వానల్లో ఎంతెంతా గుండెలు నిండేను 
మెడల్లో పూవుల దండేను
కోయిలల కూతలతో, కమ్మని మామిడి పూతలతో
నెమలమ్మ ఆటలతో, తియ్యని తెలుగు పాటలతో
పట్టు పరికిణితో, చెట్టు పుట్టలతో
చెట్టపట్టాలు చెడ్డ ఇష్టాలు  

చరణం 2:

కన్నుల్లో వెన్నెల్లే కురిసేలా కళకళలాడాలి
తలంలో కిలకిలలాడాలి
ఓ...
వేకువలో కువకువలా కూతల్లే నవ్వులు రువ్వాలి
అవన్నీ పువ్వులు కావాలి
అహ.. మెల్లంగా మచ్చికతో గిత్తల నిట్ఠా పట్టాలి
అచ్చంగా పచ్చికలో అచ్చికబుచ్చిక లాడాలి
స్వాతిచినుకుల్లో స్నానమాడాలి
తేనెగంగల్లే తనువు పొంగాలి