ముందెళ్ళే దానా
ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
గానం: బాలు
రచన: మైలవరపు గోపి
పల్లవి:
ఏయ్... ముందెళ్ళే దానా
నీ ఎనకాలే రానా
నా ముందెళ్ళే దానా
నీ ఎనకాలే రానా
చిన్నదాన ఉన్నాదాన
చెంప స్వరాలున్నా దానా
ఉన్నది జాగరతే
పిల్లదానా
నిన్నున్నట్లే దోచాలని నేనున్నా
నువ్వెంత గడుసైనా
నీ కల్లోకి రానా
కాటుకెట్టలేనా
నిను కాటెయ్యలేనా
చరణం 1:
హే...గిత్తలేమో ఒంగోలంటా
మువ్వలేమో పెద్దాపురం
గిత్తలేమో ఒంగోలంటా
మువ్వలేమో పెద్దాపురం
కుప్పెలేమో కాకినాడ బుల్లెమ్మా
అవి కూడినాయే ఒక చోటా చిన్నమ్మా
చరణం 2:
ఎత్తిపోత నీళ్ళల్లో ఎంతసేపు మునిగున్నా
ఎత్తిపోత నీళ్ళల్లో ఎంతసేపు మునిగున్నా
కొత్త బిచ్చగాడి వేడి తగ్గేనా
నీ కోక గాలి తగలాలే కాస్తయినా
చరణం 3:
గళ్ళచీర కుచ్చెళ్ళెట్టి ఒళ్ళో అట్టా దోపేసావే
గళ్ళచీర కుచ్చెళ్ళెట్టి ఒళ్ళో అట్టా దోపేసావే
కుచ్చెళ్ళు కావు అవి సూడమ్మా
నా కుర్రమనసు ఇరుక్కుందే చుక్కమ్మా