May 25, 2021

నడక సాగితే రాదారీ


నడక సాగితే రాదారీ
ఇంటింటి భాగవతం (1988)
రచన: జాలాది రాజారావు 
సంగీతం: వాసూరావు 
గానం: బాలు 

పల్లవి:

నడక సాగితే రాదారీ
పడవ లాగితే గోదారి
నడక సాగితే రాదారీ
పడవ లాగితే గోదారి 

రాదారి వరదొచ్చి మునిగితే 
అది గోదారౌతాది 
గోదారి ఎండేసి ఎండితే 
మళ్ళీ రాదారే ఔతాది 

నడక సాగితే రాదారీ
పడవ లాగితే గోదారి

చరణం 1:

మైలు మైలుకీ రాళ్ళుంటాయి రాదారిలో
నడక పొడుగునా సుడులుంటాయి గోదారిలో
ఆ రాయిని చెక్కి రంగులు వేస్తే 
దేవుడె ఔతాడు 
కాలుజారి సుడిలో పడినోడు 
దేవుడ్నే చూస్తాడు 
గుడికెక్కినా...కొండెక్కినా 
గుణమొక్కటే మూగజీవాలకు 
ఇదేరా జీవితం 
ఇదేరా జీవితం 

చరణం 2:

తల్లిపేగునే తెంచుకుపోయే 
ఋణబంధమా 
తండ్రి కొడుకులకు తలకొరివొకటే 
అనుబంధమా 
సావక ముందే తలకొరివెట్టే 
తనయులు ఉంటారా...?
ఆ తాగిన పాలకు న్యాయం చేయని 
కొడుకులు పుడతారా...?
ఓ కాలమా...!
ఇది న్యాయమా...?
ఏడేడు జన్మాల బలిదానమా...?
ఇదేనా జీవితం..? 
ఇదేనా జీవితం..?