ఉన్నాడురా ఆ దైవము
నా దేశం (1982)
సంగీతం: చక్రవర్తి
రచన: వేటూరి
గానం: నందమూరి రాజా
పల్లవి:
ఉన్నాడురా ఆ దైవమూ
ఉంటాడురా నీ కోసమూ
ఉన్నాడురా ఆ దైవము
ఉంటాడురా నీ కోసము
కష్టాలు కడతేర్చగా...హా
తన ఇల్లురా ఈ లోకము
మన దిక్కురా ఆ దైవము
ఉన్నాడురా ఆ దైవము
చరణం 1:
చీకట్లే ముసిరేవేళా
జాబిల్లి తానయ్యాడా
నారేసినా దేవుడే
నీరిచ్చి కాపాడాడా
వేదం ఔనన్నా
వాదం కాదన్నా
అతడే లేకుంటే జగమే లేదన్నా
తండ్రే లేకా బిడ్డలు లేరన్నా
నా మాటా గురుతుంచుకో
నీ తోడై వెలుగునీడల్లో
కలిమిలేముల్లో
బతుకు బాటల్లో
చరణం 2:
నీ ఆకలే తీర్చగా
ఔతాడురా అన్నము
కన్నీటినే తుడవగా
ఔతాడురా నేస్తము
రూపాలెన్నెన్నో
నామాలెన్నెన్నో
మనసే నీకుంటే మార్గాలెన్నెన్నో
దేవుని చేరే మార్గాలెన్నెన్నో
దీపాలు వెలిగించుకో
నీ వాడై పిలిచే నీకోసం
పలికే ఆ దైవం
నీవై
నీలోనే...