May 25, 2021

ప్రేమా ప్రేమా చెప్పమ్మా



ప్రేమా ప్రేమా చెప్పమ్మా 
రుక్మిణి (1997)
సంగీతం: విద్యాసాగర్
రచన: సిరివెన్నెల
గానం: విద్యాసాగర్, చిత్ర, బాలు 

పల్లవి:

ప్రేమా ప్రేమా చెప్పమ్మా 
చితిమంటేనా నీ చిరునామా 
పసి హృదయాలను పావులు చేసే 
మాయాజూదం చాలమ్మా 
జతకలుపుట పాపమా 
చరితలకిది లోపమా 
మమతకు ఈ గాయమే న్యాయమా...?

ప్రేమా ప్రేమా చెప్పమ్మా 
చితిమంటేనా నీ చిరునామా 
పసి హృదయాలను పావులు చేసే 
మాయాజూదం చాలమ్మా 

చరణం 1:

రావమ్మా ప్రణయమా 
అని నిను అడిగామా చెప్పుమా  

జాడైనా తెలియకా 
మనసును శాసించే మోసమా 

నీ రాకే వెలుగని
నమ్మడమే దోషమా 

నీ వెనకే పొరబడి 
నడవడమే శాపమా 

ఈ ఎడబాటు సుడిలోన 
పడదోసావా ప్రేమా  

చరణం 2:

ప్రేమంటే తెలియని 
బతుకులే మేలంటూ చాటమా 

ప్రేమిస్తే వరముగా 
చివరికి దొరికేది ద్వేషమా 

మనసుంటే నేరమా 
చెలిమంటే ఘోరమా 

మా గాథే సాక్ష్యమా 
ఈ బాధే సత్యమా 

ఈ విరహాల విలయాన 
బలిచేస్తావా ప్రేమా