May 10, 2021

దూరాన దూరాన తారాదీపం


దూరాన దూరాన 
చిత్రం :  మా బంగారక్క (1977)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దేవులపల్లి కృష్ణశాస్త్రి
నేపధ్య గానం : జి. ఆనంద్ 

పల్లవి:

దూరాన దూరాన తారాదీపం 
భారమైన గుండెలో ఆరని తాపం 
ఆరిపోదు చేరరాదు ఆశాదీపం 
ఆ తారాదీపం 
నీ తీరని తాపం 

చరణం 1:

వికసించిన మందారం 
నీ ఒయ్యారం 
విరియని పసికందు మొగ్గ 
నీ హృదయం 

వికసించిన మందారం 
నీ ఒయ్యారం 
విరియని పసికందు మొగ్గ 
నీ హృదయం 

మనసులోన మధురమైన 
మకరందము ఉన్నదని 
మరీమరీ తిరిగేను 
మతిమాలిన తుమ్మెదలు 

చరణం 2:

కనులనిండ నీ రూపే కాపురముంటే 
మనసంతా నీ స్మృతులే రగులుతుంటే 
ఎన్నాళ్ళీ కారుచిచ్చు లోన దాచగలను 
ఎన్నాళ్ళీ ఒంటరి బ్రతుకిలా ఈదగలను 

ఒక్క గాలి అలనై నీ చెక్కిలి నిమిరి 
ఒక్క మబ్బునై నీపై వలపుజల్లు చల్లి 
ఒక్క గాలి అలనై నీ చెక్కిలి నిమిరి 
ఒక్క మబ్బునై నీపై వలపుజల్లు చల్లి 

ఒక్కసారి నీ చెవిలో వీడుకోలు పలికి 
రెక్కలు తెగి ఎక్కడో రాలే పోతాను
నీ పక్కకైనా రాను