ఇది మౌనగీతం...
పాలు-నీళ్ళు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
గానం: ఆశా భోస్లే
రచన: దాసరి
పల్లవి:
ఇది మౌనగీతం...
ఒక మూగ రాగం...
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
ఇది మౌనగీతం...
చరణం 1:
పట్టపగలు చందమామ పొడిచిన రోజు
ఆకాశం హరివిల్లై వంగిన రోజు
పట్టపగలు చందమామ పొడిచిన రోజూ
ఆకాశం హరివిల్లై వంగిన రోజు
కడలి పొంగి ఆడిన రోజు
మూగ గొంతు పాడిన రోజు
కడలి పొంగి ఆడిన రోజు
మూగ గొంతు పాడిన రోజు
దొరకక...దొరకక...
దొరకక దొరకక దొరికిన రోజు
దొరికీ దొరకక దొరికని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఒకే ఒక్క రోజూ తిరిగిరాని రోజు
చరణం 2:
వెన్నెలంతా మల్లెలై పూచిన రోజు
మల్లెలన్ని తారలై మెరిసిన రోజు
వెన్నెలంతా మల్లెలై పూచిన రోజూ
మల్లెలన్ని తారలై మెరిసిన రోజూ
గుండె బరువు మరిచిన రోజు
పాల గుండె పొంగిన రోజు
గుండె బరువు మరిచిన రోజు
పాల గుండె పొంగిన రోజు
మిగలక...మిగలక...
మిగలక మిగలక మిగలిన రోజు
మిగిలీ మిగలక మిగలని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఒకే ఒక్క రోజూ తిరిగిరాని రోజు
No comments:
Post a Comment
Leave your comments