సో బ్యూటీ...ఊటీ...ఊటీ...ఊటీ
శుభవార్త (1998)
గానం: చిత్ర, బాలు
సంగీతం: కోటి
రచన: భువనచంద్ర
పల్లవి:
కుల్కు బేబీ
మస్తు రూబీ
గుల్ గులాబీ
ఎంటర్‌టైనింగ్
నా హాబీ...
ఆకశాన మెరిసే
మేలిమబ్బు వయ్యారాలతోటి
నేలతల్లి ఒడిలో
గుప్పుమన్న పరిమళాల పోటీ
సో బ్యూటీ...ఊటీ...ఊటీ...ఊటీ
కుల్కు బేబీ
మస్తు రూబీ
గుల్ గులాబీ
ఎంటర్‌టైనింగ్
చరణం 1:
చూపే శృంగారబాణం
అది తగిలి రగిలె ఒక తాపం
మాటే వసంతగీతం
అణువణువు తొణికె అనురాగం
పెదవిలో మకరందాలు
తరువులో సుమగంధాలు
మనసులో మృధుభావాలు
నడకలో నవలాస్యాలు
మగతనమే మధువనమా
నవ్వే పువ్వమ్మా
నువ్వైనా చెప్పమ్మా
ఇదేనా ప్రేమ మహిమా
చరణం 2:
రారా ఉల్లాస వీర
నిను పిలిచె వయసు మనసార
కలలే కౌగిళ్ళు కాగా
ముడిచేసుకోర బిగియార
ప్రియతమా ఇది తొలిప్రేమ
విరహమే తన చిరునామా
పరువమే ఒక ఇంధనమై
కరుగు తడి పొడి హంగామా
కలవరమే తగదు సుమా
కూసే గోరింక
నువ్వైనా చెప్పమ్మా
ఇదేనా ప్రేమ మహిమ