ఇందుకేనా
చిత్రం : చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు
పల్లవి:
ఇందుకేనా...
ఇది ముందుగ నీకు తెలిసేనా
ప్రేమించమన్నావూ
ప్రేమను ప్రేమించమన్నావూ...
ఇందుకేనా...
ఇది ముందుగ నీకు తెలిసేనా
ప్రేమించమన్నావూ
ప్రేమను ప్రేమించమన్నావూ...
చరణం 1:
ఓటమి ఓర్వని నిన్నీ
కాటికి పంపుటకా
ఒడిలో ఒదిగిన తలకీ
కొరివిని పెట్టుటకా
ఎదలో దాచిన నిన్నీ
చితిలో చూచుటకా
ఈ చితిమంటలు
నా బ్రతుకంతా మోయుటకా...?
చరణం 2:
నిన్న మెరిసిన కన్నులేవీ
నిగ్గులొలికిన బుగ్గలేవీ
కౌగిలించిన కరములా ఇవి?
కదలి ఆడిన పదములా ఇవి?
పుత్తడిబొమ్మగ తలచిన నిన్ను
బొమికల కుప్పగ చూస్తున్నాను
చరణం 3:
నా గుడినే కూల్చావు
నీ గురుతులు వదిలావు
నీ బరువును నాపై మోపి
నను బ్రతికుండమన్నావు
ఈ మిగిలిన శిథిలాలు
నా రగిలే కన్నీళ్ళు
మోస్తుంటాను భువిలోనా
చూస్తుంటావా దివిలోనా...